బాక్స్ ఆఫీస్ దగ్గర బాహుబలి సిరీస్ సృష్టించిన భీభత్సం ఎలాంటిదో అందరికీ తెలిసిందే…. ఇలాంటి సినిమా మా ఇండస్ట్రీ నుండి ఎందుకు రాలేదు అని అనుకోని ఇండస్ట్రీ లేదు, ఇలాంటి సినిమా రేంజ్ సినిమాను నిర్మించాలని ట్రై చేయని ఇండస్ట్రీ లేదు, అన్ని ఇండస్ట్రీలు ట్రై చేసినా బాహుబలిని మాత్రం ఎవ్వరూ టచ్ కూడా చేయలేక పోయారు… కానీ ఎప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ బడ్జెట్ తో రాజులు రాజ్యాల కాలం టైప్ మూవీ వచ్చినా….
బాహుబలితో పోలికలు మొదలు అవ్వడం మాత్రం కామన్ అయిపొయింది అని చెప్పాలి. ఇప్పుడు లేటెస్ట్ గా కోలివుడ్ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్ లో 2 పార్టులుగా రానున్న పొన్నియన్ సెల్వన్ సిరీస్ లోని మొదటి పార్ట్ ఆడియన్స్ ముందుకు త్వరలో రాబోతూ ఉండగా…
రీసెంట్ గా ఆ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా కోలివుడ్ ఆడియన్స్ కి ఆ ట్రైలర్ ఓ అద్బుతంలా అనిపించినా మిగిలిన ఇండస్ట్రీలకు మాత్రం జస్ట్ యావరేజ్ అనిపించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ కోలివుడ్ సినీ లవర్స్ సోషల్ మీడియా లో ఆల్ రెడీ సినిమాను బాహుబలి తో కంపేర్ చేస్తూ…
ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత బాహుబలి సైతం బొక్కలా ఉంది అంటూ నాటుగానే సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ ఉండగా దానికి టాలీవుడ్ సినీ లవర్స్ ఓ రేంజ్ లో రివర్స్ ట్రోల్ చేస్తున్నారు… ఇది వరకు కూడా ఇలానే 2015 టైం లో బాహుబలి1 వచ్చినప్పుడు తర్వాత పులి సినిమా గ్రాఫిక్స్ చూసి బాహుబలిని కంపేర్ చేస్తే పులి పిల్లిలా తోక ముడుచుకుంది.
ఇప్పుడు మళ్ళీ బాహుబలితో పొన్నియన్ సెల్వన్ ని కంపేర్ చేస్తూ సినిమాను అనవసరంగా ట్రోల్ అయ్యేలా చేస్తున్నారు కోలివుడ్ ఫ్యాన్స్ కొందరు… ప్రస్తుతానికి సినిమా పై తమిళ్ లో తప్పితే ఎక్కడా మినిమమ్ హైప్ లేదు. రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుంటేనే సినిమా కలెక్షన్స్ పరంగా జోరు చూపించవచ్చు…. బాహుబలిని అందుకోవాలి అంటే 1800 కోట్లు కొల్లకొట్టాలి. ఆ సత్తా ఈ సినిమా కి ఉందొ లేదో చూడాలి.