Home న్యూస్ 23 డేస్ లో బాహుబలి2 కొడితే…పుష్ప2….18 రోజుల్లో చరిత్ర చింపేసింది!!

23 డేస్ లో బాహుబలి2 కొడితే…పుష్ప2….18 రోజుల్లో చరిత్ర చింపేసింది!!

0

ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డుల బెండు తీస్తూ కొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), ప్రతీ రోజూ ఎదో ఒక రికార్డ్ ను నమోదు చేస్తూనే ఉండగా…ప్రీవియస్ బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసిన సినిమాల…

కలెక్షన్స్ రికార్డులను అన్నీ కూడా చెల్లాచెదురు చేస్తూ మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషం…సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో మరో ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది…ఇండియన్ సినిమా హిస్టరీలోనే…

Pushpa 2 The Rule 17 Days Total WW Collections Report!!

ఫాస్టెస్ట్ 1500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది….ఇది వరకు ఈ రికార్డు ఏడున్నర ఏళ్ల క్రితం రిలీజ్ అయ్యి ఇండియన్ సినిమా రికార్డులు అన్నీ చెల్లాచెదురు చేసిన బాహుబలి2 సినిమా పేరిట ఉండేది…ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…

23 రోజుల్లో ఓవరాల్ గా ఎపిక్ 1500 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…ఏడున్నర ఏళ్ల తర్వాత ఇప్పుడు పుష్ప2 మూవీ ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి 18 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 1500 కోట్ల గ్రాస్ మార్క్ ని అధిగమించింది..

బాహుబలి2 మూవీ యావరేజ్ గా రోజుకి 65.21 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుని 23 రోజుల టైం తీసుకుని మమ్మోత్ 1500 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా ఇప్పుడు పుష్ప2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీర లెవల్ లో కుమ్మేస్తూ యావరేజ్ గా రోజుకి…

83.33 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంటూ 18 రోజుల్లోనే 1500 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని చరిత్రని చింపేసి కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. ఇక సినిమాకి ఇంకా క్రిస్టమస్ అలాగే న్యూ ఇయర్ హాలిడే లు ఉండనే ఉండటంతో లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు నమోదు అవ్వడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here