ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప2(Pushpa2 The Rule Movie) రిలీజ్ అయిన రోజు నుండి మాస్ రికార్డులతో దుమ్ము దుమారం లేపగా, మొదటి వారం మొత్తం రికార్డుల జాతర కొనసాగింది..సౌత్ మొత్తం మీద బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన…
సినిమాల మొదటి వారం కలెక్షన్స్ ని భారీ మార్జిన్ తో బ్రేక్ చేసి సరికొత్త బెంచ్ మార్క్ ని నమోదు చేసిన అల్లు అర్జున్….ఇప్పుడు పుష్ప2 తో నమోదు చేసిన ఈ రికార్డ్ ఫ్యూచర్ లో ఇతర సినిమాలకు అందుకోవడం కత్తిమీద సాము అనే చెప్పాలి…
ఒకసారి సౌత్ బిగ్గెస్ట్ మూవీస్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే…ప్రభాస్ కల్కి మూవీ మొదటి వారంలో 343.92 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా గ్రాస్ పరంగా 660.70CR కోట్ల గ్రాస్ తో మాస్ ఊచకోత కోసింది….ఇక ఈ సినిమా మీద బెటర్ గా ఎన్టీఆర్ రామ్ చరణ్ ల…
ఆర్ ఆర్ ఆర్ మూవీ మొదటి వారంలో 392.85 కోట్ల దాకా షేర్ ని అందుకోగా, గ్రాస్ పరంగా 710CR కోట్ల గ్రాస్ తో కుమ్మేసింది….ఇక మూడో ప్లేస్ లో మమ్మోత్ కేజిఎఫ్2 మూవీ 357.01 కోట్ల షేర్ ని అందుకోగా 719.30 కోట్ల గ్రాస్ ను అందుకుంది. షేర్ పరంగా ఆర్ ఆర్ ఆర్ టాప్ 3 లో ఉంటే గ్రాస్ పరంగా కేజిఎఫ్2 టాప్ 3 ప్లేస్ లో నిలిచింది.
ఇక ఇది వరకు టాప్ ప్లేస్ లో 7 ఏళ్లకి పైగా ఉండి ఇప్పుడు టాప్ 2 ప్లేస్ కి వచ్చిన ఎపిక్ బాహుబలి2 మూవీ మొదటి వారంలో 430 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 835 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో ఎపిక్ రికార్డ్ ను అప్పట్లో నమోదు చేయగా ఇప్పుడు ఈ రికార్డ్ ను బ్రేక్ చేసిన పుష్ప2 మూవీ…
మొదటి వారంలో 505.15 కోట్ల షేర్ ని అందుకోగా గ్రాస్ పరంగా 1010.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ తో ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసింది. బాహుబలి2 మీద ఏకంగా 175 కోట్ల రేంజ్ లో లీడ్ తో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని నమోదు చేసింది. ఇక ఫ్యూచర్ లో వచ్చే సినిమాలు ఈ రికార్డ్ ను అందుకుంటాయో లేదో చూడాలి.