Home గాసిప్స్ #BB3 మూవీ…బాలయ్య అఘోరా లుక్ టెస్ట్ లీక్…ఇలానే ఉంటుందట!

#BB3 మూవీ…బాలయ్య అఘోరా లుక్ టెస్ట్ లీక్…ఇలానే ఉంటుందట!

1084
0

నట సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో డిఫెరెంట్ రోల్స్ లో నటించారు, ఇలా అనేక గెటప్స్ లో కనిపించి మెప్పించిన బాలయ్య చేయని రోల్ అంటూ పెద్దగా లేవనే చెప్పాలి. కానీ ఇప్పటి వరకు తన కెరీర్ లో చేయని డిఫెరెంట్ రోల్ ని ఇప్పుడు మాస్ డైరెక్టర్ తనకి రెండు సార్లు అల్టిమేట్ బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న అప్ కమింగ్ మూవీ లో…

ఓ సెన్సేషనల్ రోల్ లో కనిపించడానికి సిద్ధం అవుతున్నాడు బాలయ్య.. కాగా పక్కా కమర్షియల్ మూవీనే అయినప్పటికీ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కి గాను బాలయ్య ఈ సినిమా లో అఘోరా లుక్ లో కనిపించబోతున్నారు అన్న విషయం ఎప్పుడో అందరికీ కన్ఫాం చేశారు మేకర్స్…

కాగా ఆ లుక్ ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం ఆసక్తి కరం కాగా లుక్ టెస్ట్ కోసం కొన్ని లుక్స్ ని ట్రై చేసి చివరగా ఒక లుక్ ని ఫిక్స్ అయ్యారని ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది, ఒరిజినల్ లుక్ టెస్ట్ ఏమి లీక్ కాకున్నా కానీ ఇలానే ఉండొచ్చు అంటూ…

ఒక లుక్ మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది, ఆల్ మోస్ట్ అఘోరా లుక్ అంటే ఒకేలా ఉంటుంది కానీ ఈ లుక్ మరింత పవర్ ఫుల్ గా బాలయ్య కి సూపర్ గా సెట్ అయ్యేలా డిసైన్ చేశారని చెబుతున్నారు. లుక్ చూస్తుంటే టేర్రిఫిక్ గా ఉందని చెప్పాలి. మరి సినిమా లో బాలయ్య ఈ లుక్ లో కనిపిస్తే ఆడియన్స్ కి గూస్ బంప్స్ రావడం ఖాయమని చెప్పొచ్చు. ఇక బాలయ్య పెర్ఫార్మెన్స్ కూడా…

ఈ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అదిరిపోతుంది అంటూ చెబుతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు మే 28 న తీసుకు రాబోతున్న విషయం తెలిసిందే. బాలయ్య బోయపాటి ల కాంబోలో వస్తున్న హాట్రిక్ మూవీ అవ్వడం తో అంచనాలు గట్టిగా ఉన్నాయి. సినిమా అంచనాలను మించే విధంగా ఉంటుంది అని అంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here