Home గాసిప్స్ బాలయ్య-బోయపాటి మూవీకి టైటిల్స్ దొరట్లేదా…..ఈ టైటిల్స్ ఏంటి సామి!

బాలయ్య-బోయపాటి మూవీకి టైటిల్స్ దొరట్లేదా…..ఈ టైటిల్స్ ఏంటి సామి!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి… సినిమాలు ఎంత పవర్ ఫుల్ గా ఉన్నాయో సినిమాల టైటిల్స్ కూడా అదే రేంజ్ లో పవర్ ఫుల్ గా ఉండటం తో అవి కూడా కలిసి వచ్చాయి. కానీ వీళ్ళ కాంబినేషన్ లో ఇప్పుడు రాబోతున్న మూడో సినిమా టైటిల్ పై అనేక….

అనుమానాలు ఉన్నాయి అన్నది లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్… అసలే ఇటు బాలకృష్ణ అటు బోయపాటి లు రీసెంట్ టైం లో వరుస పరజాయలతో ఉన్న టైం లో వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా పై అల్టిమేట్ బజ్ కూడా ఏర్పడగా టైటిల్ ఏది అని ఫైనల్ చేయలేక పోతున్నారట.

అనేక టైటిల్స్ ని కన్సిడర్ చేయగా ఏది కూడా ఫైనల్ అవ్వడం లేదని సమాచారం. ముందు మోనార్క్ ఆల్ మోస్ట్ కన్ఫాం చేసినప్పటికీ మళ్ళీ ఎందుకనో ఆ టైటిల్ కి నో చెప్పి సూపర్ మ్యాన్ అనే టైటిల్ ని అనుకున్నారని టాక్ వచ్చింది.

తర్వాత ఈ సినిమా కి వారియర్ అనే టైటిల్ ని కూడా అనుకున్నారని వార్తలు రాగా ఇప్పుడు లేటెస్ట్ గా మరో టైటిల్ కూడా వినిపిస్తుంది. ఈ సారి టైటిల్ డేంజర్ అని అంటున్నారు. ఒక టైటిల్ కి ఒక టైటిల్ కి అసలు ఏమాత్రం సంభందం లేకుండా ఉన్న ఈ టైటిల్స్ అన్నీ కూడా కన్సిడరేషన్ కి వచ్చాయి అని న్యూస్ ఉంది.

కానీ ఇందులో ఏది ఫైనల్ అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉండగా ఇంకా సమయం ఉన్న నేపధ్యంలో మరిన్ని టైటిల్స్ ని గమనించి మొదటి సినిమాలకు ఏమాత్రం తగ్గని టైటిల్ ని ఎంచుకోవాలి అని టీం భావిస్తుందట. సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మళ్ళీ మొదలు అవుతుందని అంటున్నారు. ఈ సినిమా తో బాలయ్య బోయపాటి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వడం ఖాయమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here