Home న్యూస్ మాస్ మూవీ…ఓవర్సీస్ లో బాలయ్య బోయపాటి బిజినెస్…బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

మాస్ మూవీ…ఓవర్సీస్ లో బాలయ్య బోయపాటి బిజినెస్…బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

1449
0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ BB3 ఇంకా టైటిల్ ని కూడా కన్ఫాం చేయలేదు కానీ ఆడియన్స్ ముందుకు మే నెలలో రావడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే, బాలయ్య బోయపాటి ల కాంబోలో వస్తున్న హాట్రిక్ మూవీ అవ్వడం తో సినిమా పై క్రేజ్ సాలిడ్ గా ఉంది, ఇటు బాలయ్య అటు బోయపాటి వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నా కానీ…

ఇద్దరి కలయిక లో వచ్చిన సింహా లెజెండ్ సినిమాలు బాక్స్ అఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేయడం తో మళ్ళీ ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉండగా సినిమా కి అన్ని సెంటర్స్ లో బిజినెస్ కూడా అద్బుతంగా జరుగుతుంది.

సినిమా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో మేజర్ ఏరియాలలో సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేయగా సినిమా కి ఇప్పుడు ఓవర్సీస్ లో కూడా బిజినెస్ కన్ఫాం అయింది, అమెరికాలో బోయపాటి మూవీస్ కి పెద్దగా డిమాండ్ ఉండదు.. కంప్లీట్ మాస్ మూవీస్ చేస్తారు కాబట్టి…

ఆ ఇంపాక్ట్ వల్ల అక్కడ అనుకున్న రేంజ్ ఆఫర్స్ రాక తక్కువ బిజినెస్ లే చేస్తూ ఉంటాయి, అందునా ఇద్దరూ ఫ్లాఫ్స్ లోనే ఉండటం కూడా ఈ సారి కొంచం ఇంపాక్ట్ చూపి మొత్తం మీద అమెరికాలో 2 కోట్ల మేర బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఇంకా మునుపటిలా లేనప్పటికీ కూడా…

ఇంత బిజినెస్ జరగడం కూడా గొప్పే అని చెప్పాలి. ఇక సినిమా అమెరికాలో హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 550K నుండి 600K డాలర్స్ ను కలెక్ట్ చేయాల్సి ఉంటుంది, మరి మే ఎండ్ టైం లో ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ హాట్రిక్ మూవీస్ ఎంతవరకు అంచనాలను తట్టుకుని ఈ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here