Home గాసిప్స్ బాలయ్య బోయపాటి మూవీ లో…స్పెషల్ రోల్ లో యంగ్ హీరో!!

బాలయ్య బోయపాటి మూవీ లో…స్పెషల్ రోల్ లో యంగ్ హీరో!!

602
0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో సింహా లెజెండ్ సినిమాల తర్వాత రూపొందుతున్న మూడో సినిమా టీసర్ గ్లిమ్స్ ని రీసెంట్ గా రిలీజ్ చేయగా రెస్పాన్స్ పీక్స్ లో వచ్చిన విషయం తెలిసిందే, సినిమా ను బోయపాటి సెప్టెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టి నాన్ స్టాప్ గా జరిపి సినిమా ను సంక్రాంతి రేసు లో నిలపాలనే ఆలోచన లో ఉన్నారని టాలీవుడ్ లో టాక్ ఉంది.

ఇక సినిమా కోసం బాలయ్య రెండు డిఫెరెంట్ గెటప్స్ లో కనిపించ బోతుండగా సినిమా లో ఓ యంగ్ హీరో స్పెషల్ రోల్ కూడా ఉందని లేటెస్ట్ గా టాలీవుడ్ లో వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. బోయపాటి సినిమా అంటే స్టార్ కాస్ట్ చాలా పెద్దగా ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే.

అందులో స్పెషల్ రోల్స్ కూడా ఉంటాయి… ఈ సారి బాలయ్య బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో వస్తున్న హాట్రిక్ మూవీ లో సెకెండ్ ఆఫ్ లో ఓ స్పెషల్ రోల్ ఉందట. ఆ రోల్ కోసం బెల్లంకొండ శ్రీనివాస్ ని బోయపాటి కలిసారని టాక్ ఉంది.

10 నిమిషాల వ్యవధి ఉండే ఈ రోల్ కి ఓ ఫైట్ సీన్ కూడా ఉంటుందని టాక్ ఉంది. లెజెండ్ లో బాలయ్య చిన్నప్పటి రోల్ మాదిరి పవర్ ఫుల్ గా ఈ 10 నిమిషాల ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు. బెల్లంకొండ తో బోయపాటి ఇది వరకే జయ జానకి నాయక సినిమా తీసిన విషయం తెలిసిందే.

ఆ గౌరవం వలెనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని కూడా న్యూస్ ఉంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అన్నది అఫీషియల్ న్యూస్ వస్తే కానీ చెప్పలేం కానీ నిజం అయితే మట్టుకు సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ కి మాస్ లో మరింత క్రేజ్ సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here