వారిని కొద్దిగా నిరాశ పరుస్తూ సినిమా మోషన్ పోస్టర్ తోనే సరిపెట్టారు యూనిట్. కానీ అందరికీ షాక్ ఇస్తూ ఇప్పుడు రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ చాలా బాగా ఆకట్టుకోవడమే కాకుండా సాలిడ్ గా కుమ్మేసేలా ఉందని అందరి చేత ప్రశంసలు సొంతం చేసుకుంటుంది.
కూల్ కాన్సెప్ట్ తో ప్రసిద్ధ ప్రేమికులను ఒక ట్రైన్ లో చూపిస్తూ, చివరగా ప్రభాస్ పూజ హెగ్డే ల మీద కెమరా షాట్స్ అల్టిమేట్ గా సెట్ అవ్వగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదే రేంజ్ లో ఎలివేట్ అయ్యింది అని చెప్పాలి, ఇక విజువల్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఉన్నాయి.
మొత్తం మీద ఎదో సాదాసీదా మోషన్ పోస్టర్ తో సరిపెట్టేస్తారు అనుకుంటే యువి క్రియేషన్స్ వాళ్ళు ఒకప్పటి మ్యాజిక్ ని రీ క్రియేట్ చేస్తూ ఎక్స్ లెంట్ మోషన్ పోస్టర్ తో సినిమా పై అంచనాలను మరింతగా పెంచేశారు అని చెప్పాలి. దాంతో ప్రభాస్ పుట్టిన రోజున ఫ్యాన్స్ కి ఇది అల్టిమేట్ ట్రీట్ గా మారింది అని చెప్పొచ్చు.
ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు ఇండియా లో మోషన్ పోస్టర్స్ పరంగా కొత్త రికార్డులు ఈ మోషన్ పోస్టర్ కి దక్కేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే సాలిడ్ స్టార్ట్ ను సొంతం చేసుకున్న ఈ మోషన్ పోస్టర్ 24 గంటలు పూర్తి అయ్యే సరికి మొత్తం మీద ఎన్ని మిలియన్స్ వ్యూస్ ని ఎన్ని లక్షల లైక్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి మరి.