లాస్ట్ ఇయర్ కరోనా ఎంటర్ అయిన తర్వాత అన్ని ఇండస్ట్రీలకు భారీ ఎదురుదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే, అప్పటి నుండి ఇప్పటి వరకు అసలు ఏమాత్రం కోలుకోలేక పోయిన ఇండస్ట్రీ ఏదైనా ఉందీ అంటే అది కచ్చితంగా బాలీవుడ్ అనే చెప్పాలి. అంతకుముందు వరుస బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్నప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ నుండి థియేటర్స్ ని మూసేసి ఉంచడం తో సినిమాలను డిజిటల్ లో…
రిలీజ్ చేసుకుంటున్నారు తప్పితే పెద్దవి ఏవి కూడా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవ్వలేదు, ఇలాంటి టైం లో ఆల్ మోస్ట్ ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అయిన బిగ్ మూవీ గా అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ…
బెల్ బాటం సినిమా నిలిచింది అని చెప్పాలి. డిజిటల్ లోనే రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ సినిమా ను చివరి నిమిషంలో పరిస్థితులు ఎలా ఉన్నా థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ డిసైడ్ అయిన అక్షయ్ కుమార్ కొన్ని గంటల్లో ఇండియా వైడ్ గా ఆల్ మోస్ట్ 2200 స్క్రీన్స్ లో బెల్ బాటం సినిమాను…
రిలీజ్ చేయబోతున్నారు, ఇక ఈ సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ లెక్కలు 40 కోట్ల రేంజ్ లో ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ఈ లెక్కన హిట్ అవ్వాలి అంటే మినిమం 75 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని ఇండియా లో సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ మొదలు అవ్వగా…
ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ తో 2 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ కన్ఫాం అవ్వగా ఫస్ట్ డే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6-8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి సినిమా ఇంతకుమించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపుతుందో లేదో అన్నది కొన్ని గంటల్లో తేలబోతుంది అని చెప్పాలి.