Home న్యూస్ బెల్ బాటం రివ్యూ….కుమ్మింది సినిమా!!

బెల్ బాటం రివ్యూ….కుమ్మింది సినిమా!!

0

కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా చూసే టైం లో అంచనాలను అందుకోకుండా ఉండే సినిమాలు ఉంటాయి, అందుకునే సినిమాలు ఉంటాయి, అందుకున్నట్లే అందుకుని కొద్దిలో మిస్ చేసుకునే సినిమాలు కూడా ఉంటాయి. ఈ మూడో కోవలోకే వస్తుంది కన్నడ నుండి తెలుగు లో డబ్ అయ్యి ఆహా యాప్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న బెల్ బాటం అనే సినిమా… లాస్ట్ ఇయర్ కన్నడ లో సైలెంట్ గా రిలీజ్ అయ్యి…

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీ లో ఆల్ రెడీ రీమేక్ అవుతూ ఉండగా తెలుగు లో సినిమాను ఆహా యాప్ లో డబ్ చేసి రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ చేశారు. మరి సినిమా ఎలా ఉంది, ఎంత వరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే దొంగల నుండి డబ్బు నగలను రికవరీ స్టేషన్ లో లాకర్ లో పెట్టినా తెల్లారే సరికి ఆ డబ్బు నగలు మాయం అవుతాయి, వాటిని కాజేసింది ఎవరు అని పోలీసులు తలలు పట్టుకోగా, చిన్నప్పటి నుండి డిటెక్టివ్ అవ్వాలని కళలు గనే హీరో పెద్దయ్యాక తండ్రి ఫోర్స్ వలన…

పోలిస్ కానిస్టేబుల్ అవుతాడు, తన తెలివి తేటలతో ఒక క్లిష్ట కేసుని సాల్వ్ చేయగా హీరో కి ఈ మిస్టరీని చేదించే ఛాన్స్ ఇస్తారు పై అధికారి, మరి హీరో తన తెలివి తేటలతో ఎలా ఈ కేస్ ను సాల్వ్ చేశాడు అన్నది మొత్తం మీద సినిమా కథ. ట్రైలర్ రిలీజ్ లోనే ఆల్ మోస్ట్ ఇదే కథని చెప్పారు.

కానీ సినిమాలో చూసే టప్పుడు చాలా ఆసక్తిని కలిగిస్తుంది ఈ సినిమా.. ముందుగా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే హీరో తన రోల్ లో అదరగొట్టేశాడు, అద్బుతంగా నటించాడు, ఇక హీరోయిన్ హరిప్రియ రోల్ కూడా ఆకట్టుకునేలా ఉండగా మిగిలిన రోల్స్ చేసిన అందరూ కూడా ఉన్నంతలో తమవరకు నటించి మెప్పించారు.

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే స్టార్ట్ అవ్వడం మంచి ఆసక్తిని రేపెలా స్టార్ట్ అవ్వగా హీరో హీరోయిన్ కి ఫ్లాష్ బ్యాక్ చెప్పడం తర్వాత కేస్ ని సాల్వ్ చేసే ప్రక్రియ వరకు రేసి స్క్రీన్ ప్లే తో మెప్పించినా తర్వాత సినిమా స్లో డౌన్ అవుతుంది, అసలు హీరో కేస్ సాల్వ్ చేస్తాడా లేదా అన్న నీరసం కూడా ఒక స్టేజ్ లో కలుగుతుంది…

అప్పటికే ప్రీ క్లైమాక్స్ స్టేజ్ కి వచ్చేయడం తో మళ్ళీ స్పీడ్ అందుకుని చకచకా సినిమా ముగింపు దశకు వచ్చేస్తుంది. సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా మెప్పించాయి, సినిమాటోగ్రఫీ అదుర్స్, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి, తెలుగు డబ్బింగ్ డైలాగ్స్ కూడా బాగా సెట్ అయ్యాయి.

ఇక డైరెక్షన్ విషయానికి వస్తే మంచి డిటెక్టివ్ స్టొరీ పాయింట్ ని ఎంచుకున్నా ఫస్టాఫ్ వరకు బాగా మెప్పించినా సెకెండ్ ఆఫ్ తొలి భాగం చాలా స్లో అయ్యింది సినిమా, ఆ విషయంలో డైరెక్టర్ మరింత శ్రద్ధ తీసుకుని ఉంటె సినిమా మరో లెవల్ లో ఉండేది అని చెప్పాలి. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ మీద మరింత ఫోకస్ పెట్టి…

మరింత ఇంపాక్ట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటే బాగుండేది, అప్పటి వరకు కేస్ మిస్టరీ ఎలా వీడుతుందా అని ఎదురు చూసి చాలా సాదాసీదా ఫ్లాష్ బ్యాక్ తో సినిమాను వెంటనే ముగించారు అనిపిస్తుంది… అయినా కానీ మొత్తం మీద… డిటెక్టివ్ స్టొరీ మీద వచ్చిన మూవీస్ మరో మంచి సినిమాగా ఈ సినిమా నిలుస్తుంది అని చెప్పాలి…

కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ సినిమా చాలా వరకు మెప్పించే విధంగా ఉండటం, కొన్ని సీన్స్ బాగా ఆకట్టుకోవడం లాంటివి సినిమాకి కలిసి వచ్చి ఈజీగా ఒకసారి చూసేలా చేసింది అని చెప్పొచ్చు, మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here