Home న్యూస్ రామ్ ఓపెనింగ్స్ కి బెల్లంకొండ దెబ్బ….సడెన్ షాక్ ఇచ్చాడుగా!!

రామ్ ఓపెనింగ్స్ కి బెల్లంకొండ దెబ్బ….సడెన్ షాక్ ఇచ్చాడుగా!!

2403
0

ఇస్మార్ట్ శంకర్ తో కెరీర్ బెస్ట్ రికార్డులను సొంతం చేసుకున్న తర్వాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ రెడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలవడానికి సిద్ధం అవుతుండగా సంక్రాంతి సినిమాల్లో ముందుగా హైయెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న సినిమాగా నిలిచిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 14 న సోలో గా రిలీజ్ కి సిద్ధం అయిన విషయం తెలిసిందే.

అప్పటికే క్రాక్ మరియు మాస్టర్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ ఉన్నప్పటికీ కూడా రెడ్ కి కూడా మంచి థియేటర్స్ కౌంట్ అండ్ ఓపెనింగ్స్ దక్కుతాయి అని అంతా భావించారు. కానీ సడెన్ గా సంక్రాంతి రేసులోకి వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ ను…

ముందు జనవరి 15 న అనౌన్స్ చేయగా సడెన్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ఇప్పుడు జనవరి 14 నే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలు 14 న పోటి లో ఒకేసారి నిలవబోతున్నాయి.

సడెన్ షాక్ తో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు సినిమాలకు కలెక్షన్స్ పరంగా థియేటర్స్ పరంగా క్లాష్ గట్టిగానే ఉండేలా ఉంది. అసలే ఆల్ రెడీ 2 సినిమాల నుండి పోటి లో ఇప్పుడు మూడో సినిమా కూడా రావడం తో రెడ్ మూవీ కి ఓపెనింగ్స్ అండ్ థియేటర్స్ తగ్గే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. చెరొక రోజు వచ్చి ఉంటె రెండు సినిమాలకు ఓపెనింగ్స్ దక్కేవి. కానీ ఇప్పుడు పోటి వలన…

రెండు సినిమాలకు కూడా ఓపెనింగ్స్ క్లాష్ అవ్వడం ఖాయం.. వారం 10 రోజుల క్రితం వరకు సంక్రాంతి రేసు లోనే నిలవని అల్లుడు అదుర్స్ సడెన్ గా రేసులోకి నిలవడం ఇప్పుడు ఆల్ రెడీ రిలీజ్ కన్ఫాం అయిన సినిమాతో పోటికి దిగుతూ ఉండటం తో ఆడియన్స్ ముందు ఏ సినిమాకి వెళతారు అనేది ఆసక్తిగా మారింది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here