Home న్యూస్ బెల్లంకొండకి బంపర్ ఛాన్స్….ఈ సారి కొట్టేలా ఉన్నాడే!!

బెల్లంకొండకి బంపర్ ఛాన్స్….ఈ సారి కొట్టేలా ఉన్నాడే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie) సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన…

గరుడన్ సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ యమ జోరుగా సాగుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో డీసెంట్ బజ్ అయితే ఉంది. అలాగే మే నెలలో ఆడియన్స్ ముందుకు వచ్చిన హిట్3, సింగిల్ మరియు శుభం లాంటి సినిమాలు మంచి జోరునే చూపించి…

ఈ నెలలో హిట్ గీతని దాటిన సినిమాలుగా నిలిచాయి…మరో పక్క IPL కూడా ఎండ్ స్టేజ్ కి వచ్చేసింది…అన్ని సినిమాలు స్లో డౌన్ అయ్యాయి. దాంతో ఆడియన్స్ కి సినిమాలే మళ్ళీ ఫస్ట్ ఛాయిస్ కాబోతూ ఉండగా ఈ వీకెండ్ లో భైరవంతో పాటు…

ఖలేజా రీ రిలీజ్ కూడా ఉన్నప్పటికీ కూడా కొత్త సినిమా కొత్త సినిమానే కాబట్టి భైరవంకి డీసెంట్ ఓపెనింగ్స్ దక్కే అవకాశం ఎంతైనా ఉంది. దాంతో ఎప్పటి నుండో హిట్ కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండకి ఈ సారి మంచి హిట్ ని అందుకునే బంపర్ ఆఫర్ ఉందని చెప్పాలి.

సినిమా తమిళ్ వర్షన్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో సేం టాక్ తెలుగు లో రిపీట్ ఐతే బెల్లంకొండతో పాటు ఎప్పటి నుండో మంచి బ్రేక్ కోసం చూస్తున్న నారా రోహిత్ కి మంచు మనోజ్ కి కూడా భైరవం కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇంతమంది అంచనాలను సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here