చిన్న సినిమాలకు టాక్ చాలా అవసరం, మంచి ట్రైలర్ తో ఆసక్తిని కొంచం పెంచి ఆడియన్స్ కి నచ్చేలా పర్వాలేదు అనిపించినా కూడా జనాలు ఓ మాదిరిగా అయినా థియేటర్స్ వస్తారు…రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన సింహా కోడూరి(Simha Koduri) నటించిన కొత్త సినిమా…
భాగ్ సాలే(bhaag Saale Short Review) సినిమా టీసర్, ట్రైలర్ లు చూసిన తర్వాత సినిమా డీసెంట్ ఎంటర్ టైనర్ గా ఉన్నట్లు ఉందే అని అనుకుని ఆడియన్స్ థియేటర్స్ వస్తారు…కానీ వచ్చిన తర్వాత ఓ 15 నిమిషాల తర్వాత సినిమా స్క్రీన్ ప్లే చూసి వాళ్ళకి సినిమా ఫేట్ ఆల్ మోస్ట్ అర్దం అయిపోతుంది…
హోటల్ చెఫ్ అయిన రిచ్ హీరోయిన్ ని చూసి తాను రిచ్ కిడ్ అని కలరింగ్ ఇస్తాడు…ఇంతలో హీరోయిన్ ఇంట్లో ఉండే ఓ డైమండ్ రింగ్ మిస్ అవుతుంది…ఆ మిస్సింగ్ రింగ్ ను ఎలా వెతికారు… ఆ డైమండ్ రింగ్ మిస్టరీ ఏంటి అనేది సినిమా స్టోరీ పాయింట్…
సరిగ్గా తీస్తే సినిమా స్టోరీ పాయింట్ లో దమ్ము ఉన్న కథనే… కానీ డైరెక్టర్ రాసుకున్న స్క్రీన్ ప్లే, తెరకెక్కించిన విధానం ఓ 20 నిమిషాలకే ఓ రేంజ్ లో బోర్ కొట్టించి ఇదేం సినిమారా బాబు అని తల పట్టుకునేలా చేస్తుంది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, వీక్ స్క్రీన్ ప్లే వలన…
అడుగడుగునా బోర్ ఫీల్ అయ్యే ఆడియన్స్ సగంలోనే వాకౌట్ చేయాలి అనుకుంటారు కానీ ట్రైలర్ కట్ గుర్తుకు వచ్చి సెకెండ్ ఆఫ్ లో అయినా ఏమైనా కామెడీ ఉంటుందేమో అనుకుంటే అక్కడక్కడా కొన్ని సీన్స్ కామెడీ పుట్టించినా కానీ అది సినిమాను కాపాడేలా అయితే లేదనే చెప్పాలి.
సింహా కోడూరి మరోసారి తన పెర్ఫార్మెన్స్ తో పర్వాలేదు అనిపించినా సినిమాలోనే దమ్ము లేకపోవడంతో తను కూడా చేసేదేమీ లేకపోయింది. మొత్తం మీద ట్రైలర్ చూసి మినిమమ్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని థియేటర్స్ కి వెళితే బుక్కయిపోయినట్లే… సినిమా కి మా రేటింగ్ 1.75 స్టార్స్….