నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బాక్ టు బాక్ రెండు భారీ కెరీర్ బెస్ట్ హిట్స్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు భగవంత్ కేసరి(Bhagavanth Kesari) తో రావడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద…
ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి ఇప్పుడు. అలాగే సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన సాంగ్ అండ్ ప్రోమోలు కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా రిలీజ్ కి రెండు నెలల ముందే ఓవరాల్ గా సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది…
ఇక సినిమా ఆడియన్స్ ముందుకు అక్టోబర్ 19న రిలీజ్ ను ఎప్పుడో అనౌన్స్ చేయగా రీసెంట్ గా సినిమా గురించిన ఒక వార్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ కొద్ది వరకు ఉండటంతో అక్టోబర్ 19వరకు సినిమా ఆడియన్స్ ముందుకు…
రావడం కష్టమని అందుకే సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తూ ఉండగా…టీం నుండి దీనిపై ఇన్ సైడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా పెండింగ్ షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతుందని తెలియజేయగా… దాంతో పాటే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా…
శరవేగంగా జరుగుతుందని అంటున్నారు… రిలీజ్ కి వారం 10 రోజుల ముందే అన్ని పనులను పూర్తి చేసుకుని సినిమా ఆన్ టైంకి అక్టోబర్ 19న రిలీజ్ కాబోతుంది అని కన్ఫాం చేశారు. దాంతో దసరాకి బాలయ్య మాస్ రచ్చ ఖాయమని చెప్పొచ్చు ఇక…