బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ భారీ కెరీర్ బెస్ట్ హిట్స్ తో దూసుకు పోతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఇప్పుడు అపజయం అంటే తెలియని డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్ లో చేసిన కొత్త సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా తో రచ్చ చేయడానికి సిద్ధం అవ్వగా సినిమా వరల్డ్ వైడ్ గా….
భారీ లెవల్ లో 1350 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా సినిమా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను పూర్తి చేసుకుని అక్కడ నుండి ఫస్ట్ టాక్ ఏంటో బయటికి వచ్చేసింది… ఆ టాక్ ప్రకారం సినిమా చాలా వరకు ఆడియన్స్ అంచనాలను అందుకున్నట్లు అనిపిస్తుంది. స్టోరీ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకున్నా కూడా…
ఫ్లాష్ బ్యాక్ లో విలన్ తో హీరోకి వచ్చిన ఒక క్లాష్ వలన తర్వాత ఏర్పడిన పరిస్థితులు ఏంటి… హీరో ఎందుకని శ్రీలీలని బలంగా పవర్ ఫుల్ గా మారాలని కోరుకున్నాడు అన్నది కోర్ పాయింట్….దాని వెనక కథని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… సినిమా ఓపెన్ అయినప్పటి నుండి ఒక కొత్త బాలయ్యని చూపించిన అనిల్ రావిపూడి….
బాలయ్యని చూపించిన విధానం బాగా ఆకట్టుకుందని అంటూ ఉండగా యాక్షన్ సీన్స్ ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ లా అనిపించడం ఖాయమని అంటున్నారు, స్టోరీ పాయింట్ కొంచం రొటీన్ గానే అనిపించినప్పటికీ కూడా అటు ఎంటర్ టైన్ మెంట్, యాక్షన్ అండ్ కొంచం సెంటిమెంట్ ను కూడా బాగానే మిక్స్ చేసి ఫస్టాఫ్ వరకు ఆకట్టుకుని సాలిడ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరగగా…
సెకెండ్ ఆఫ్ లో చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఆకట్టుకున్న తర్వాత కొంచం అక్కడక్కడా స్లో అయినట్లు అనిపించినా కూడా మళ్ళీ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ నుండి రాంపేజ్ ను చూపించిన సినిమా క్లైమాక్స్ కూడా కూడా అంచనాలను తగ్గట్లే మెప్పించింది అంటున్నారు. ఇక తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బాలయ్య హీరోయిజం ఎలివేట్ సీన్స్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అని అంటున్నారు…
ఓవరాల్ గా సినిమా ఫస్టాఫ్ ఎబో యావరేజ్ గా సెకెండ్ ఆఫ్ కూడా ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించింది అంటున్నారు…సినిమా ఓవరాల్ గా ఎండ్ అయ్యే టైంకి ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించింది అంటున్నారు…. ఓవరాల్ గా బాలయ్య నుండి అఖండ, వీర సింహా రెడ్డి తర్వాత మరో డీసెంట్ టు గుడ్ మూవీగా భగవంత్ కేసరి అనిపించింది అంటున్నారు. ఓవరాల్ గా సినిమాకి ఓవర్సీస్ ఆడియన్స్ నుండి మొత్తం మీద…
ఎబో యావరేజ్ లెవల్ లో టాక్ అయితే వినిపిస్తుంది. రెగ్యులర్ షోలకు కూడా ఇదే రేంజ్ లో టాక్ ను సినిమా సొంతం చేసుకుంటే కచ్చితంగా ఆడియన్స్ ను బాగా మెప్పించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద ప్రీమియర్స్ నుండి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకున్న భగవంత్ కేసరి ఇక్కడ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.