నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అనిల్ రావిపూడి(Anil Ravipudi) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి(Bhagavanth Kesari)…. భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసు కుందాం పదండీ….
ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే ఒక కరప్ట్ పొలిటికల్ లీడర్ కు ఎదురు తిరిగిన హీరోని ఒక తప్పుడు కేసుతో జైలుకి వెళ్ళేలా చేస్తాడు విలన్, హీరో అక్కడ జైలర్ హెల్ప్ తీసుకుంటాడు…ఆ తర్వాత జైలర్ చనిపోవడంతో ఆయన కూతురుకి కేర్ టేకర్ గా మారిన హీరో శ్రీలీలని స్ట్రాంగ్ గా మార్చి మిలటరీ ఆఫీసర్ ను చేయాలి అనుకుంటాడు… ఆ తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా కథ పాయింట్…
ముందుగా అనిల్ రావిపూడి ఎంచుకున్న కథ పాయింట్ రొటీన్ గానే ఉంటుంది, ఫస్టాఫ్ కథ బాగానే స్టార్ట్ అయినా స్లో నరేషన్ తో సాగుతుంది, కొన్ని బోర్ సీన్స్ రావడంతో సినిమా ఏంటి ట్రాక్ తప్పుతుందా అనిపిస్తుంది, కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి సినిమా రూపురేఖలు మొత్తం మారిపోతాయి… సెకెండ్ ఆఫ్ అటు యాక్షన్ తో ఇటు సెంటిమెంట్ తో తమన్ వెరీ గుడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో పాటు సాలిడ్ క్లైమాక్స్ లు హెల్ప్ అయ్యి సినిమా ఎండ్ అయ్యే టైం….
Bhagavanth Kesari Movie REVIEW And RATING
ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో జనాలు థియేటర్ బయటికి రావడం ఖాయం… ఇక బాలయ్య ఈ సారి సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపాడు అని చెప్పాలి… యాక్షన్ సీన్స్ కాని, సెంటి మెంట్ సీన్స్ కానీ బాలయ్య మరోసారి బాగా నటించి మెప్పించాడు, ఇక బాలయ్య ఎలివేషన్స్ కి తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అని చెప్పొచ్చు… ముఖ్యంగా ఒకడే కేసరి బ్యాగ్రౌండ్ స్కోర్ థియేటర్స్ బయటికి వచ్చాక కూడా గుర్తు ఉంటుంది…
ఇక కాజల్ జస్ట్ ఓకే అనిపించగా శ్రీలీల ఉన్నంతలో బాగానే నటించగా అర్జున్ రామ్ పాల్(Arjun Rampal) కూడా తెలుగు లో బాగానే డైలాగ్స్ చెప్పి మెప్పించాడు, ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో టేక్ అయ్యే దాకా కొంచం స్లోగా సాగుతుంది…కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి ఎక్కువ శాతం మెప్పించగా, సెకెండ్ ఆఫ్ లో కొన్ని ఎపిసోడ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా మెప్పించాయి…
ఇక తమన్ అందించిన సంగీతం పాటల వరకు పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం కుమ్మేసింది అని చెప్పొచ్చు… ముందే చెప్పినట్లు ఎలివేషన్ సీన్స్ కి తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ అయింది. ఇక అనిల్ రావిపూడి ఎంచుకున్న పాయింట్ చాలా నార్మల్ గా ఉండగా ఫస్టాఫ్ ముందే చెప్పినట్లు స్లో స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా ప్రీ ఇంటర్వెల్ నుండి సెకెండ్ ఆఫ్ మొత్తం రాంపేజ్ ను చాలా వరకు చూపించాడు…
దాంతో పాటు వుమన్ ఎంపావర్మేంట్ గురించి ఇచ్చిన మెసేజ్ కూడా బాగా వర్కౌట్ అవ్వడంతో సినిమా ముగిసిన తర్వాత ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ బయటికి రావడం ఖాయం…. సినిమాలో బాలయ్య సటిల్డ్ పెర్ఫార్మెన్స్, శ్రీలీల గుడ్ పెర్ఫార్మెన్స్, ఎమోషన్స్ ను యాక్షన్ తో బాగా మిక్స్ చేయడం, వెరీ గుడ్ ఇంటర్వెల్ అండ్ గుడ్ సెకెండ్ ఆఫ్ మేజర్ ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.
ఇక మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్టోరీ లైన్ చాలా నార్మల్ గా అనిపించడం, ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం టైం పట్టడం, లాంటివి చిన్న మైనస్ పాయింట్స్… ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ ను ఫుల్లుగా అలరించే భగవంత్ కేసరి…. భారీ హోప్స్ తో వెళ్ళే ఆడియన్స్ కి…
ఫస్టాఫ్ కొంచం పడుతూ లేస్తూ సాగినట్లు అనిపించినా ప్రీ ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు అంచనాలను అందుకుని సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో థియేటర్స్ బయటికి వచ్చేలా చేస్తుంది. ఓవరాల్ గా సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 3 స్టార్స్….