Home న్యూస్ కల్కి-భైరవ యాంతం రివ్యూ….పాట బాగుంది….కానీ!!

కల్కి-భైరవ యాంతం రివ్యూ….పాట బాగుంది….కానీ!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి కానీ టీం అనుకున్న రేంజ్ లో సినిమాను ప్రమోట్ అయితే చేయడం లేదు ఇప్పుడు… సినిమా నుండి ఆడియన్స్ ముందుకు వచ్చిన ఒకే ఒక్క సాంగ్ అయిన….కల్కి భైరవ యాంతం(Bhairava Anthem | Kalki 2898 AD)…

ఊరించి ఊరించి ఎట్టకేలకు రిలీజ్ చేశారు ఇప్పుడు. పంజాబీ యాక్టర్ కం సింగర్ అయిన దిల్జిత్ దోసంజ్(Diljit Dosanjh) పాడిన భైరవ యాంతం ప్రోమోలో ప్రభాస్ లుక్ అందరినీ ఆకట్టుకోవడంతో సాంగ్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి పెరిగి పోగా సాంగ్ ఉన్నంతలో మరీ అద్బుతం కాదు కానీ పర్వాలేదు అనిపించేలా ఉంది…

తెలుగు లిరిక్స్ జస్ట్ ఓకే అనిపించేలా ఉన్నా కూడా హిందీ లిరిక్స్ అండ్ మ్యూజిక్ బాగానే ఇంప్రెస్ చేసేలా ఉన్నాయి… ప్రభాస్ పంజాబీ లుక్ లో కుమ్మేశాడు..ఓవరాల్ గా సాంగ్ రెస్పాన్స్ చెప్పాలి అంటే బాగుంది కానీ మరీ అద్బుతం అనిపించేలా అయితే కాదు…

సినిమా టీం నుండి చాలా గట్టి ప్రమోషన్స్ అయితే అవసరం ఉంది, మమ్మోత్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కి 10 రోజుల టైం మాత్రమే ఉండగా ప్రమోషన్స్ పరంగా టీం చాలా డిలే చేస్తున్నారు… ప్రతీసారి ప్రభాస్ మీదే భారం వేయడం తప్పు…టీం ఇక మీదట అయినా ఇంకా గట్టి ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఉంది, ఇక తెలుగు లో ఎలా ఉన్న ఈ సాంగ్ హిందీ లో నార్త్ సైడ్ కొంచం ప్రమోషన్స్ కి ఊపునిచ్చే అవకాశం అయితే ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here