బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ శుక్రవారం రిలీజ్ అయిన కొత్త సినిమా బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie) మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా మిగిలిన చోట్ల…
రొటీన్ మూవీ అన్న టాక్ ను సొంతం చేసుకుంది…కానీ ఉన్నంతలో మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపించిన సినిమా ఓవరాల్ గా మోదటి రోజు లో ఇప్పుడు పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది.
సినిమా మ్యాట్నీ షోల వరకు కొంచం స్లోగా స్టార్ట్ చేసినా కూడా తర్వాత షోల కి మాస్ సెంటర్స్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో గ్రోత్ ని చూపెడుతూ పరుగును కొనసాగించగా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో..
సినిమా అటూ ఇటూగా 1.8-2 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 2 కోట్లు ఆ పైన కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో కలిపి…
వసూళ్లు అప్ డేట్ కానుండగా ఓవరాల్ గా సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అటూ ఇటూగా 2.4-2.6 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకునే అవకాశం ఉంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండొచ్చు. ఇక అఫీషియల్ గా మొదటి రోజు సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.