బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అవుతున్న కొత్త సినిమా బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie)….ఒరిజినల్ వర్షన్ మంచి సక్సెస్ అవ్వడంతో తెలుగు వర్షన్ కూడా…
ఆడియన్స్ ను బాగా మెప్పిస్తుందని అందరూ ఆశిస్తూ ఉండగా సినిమా రీసెంట్ గా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయింది. ఇక సినిమా బిజినెస్ పరంగా ఓవరాల్ గా 18.2 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకోగా 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగబోతుంది.
ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో సుమారు 600 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా రెస్ట్ ఆఫ్ ఇండియా లో 120 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక ఓవర్సీస్ లో 250 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సుమారు…
950 నుండి 1000 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇక ఆల్ రెడీ బుకింగ్స్ ఓపెన్ చేసినా కూడా ఆశించిన మేర అయితే బుకింగ్స్ లో ఎలాంటి గ్రోత్ లేదనే చెప్పాలి….దానికి తోడూ పోటిలో ఖలేజా ఉండటంతో ఆ ఇంపాక్ట్ కూడా ఈ సినిమా మీద ఉండబోతుంది..
దాంతో భైరవం సినిమా ఇప్పుడు మౌత్ టాక్ నే నమ్ముకుని ఆడియన్స్ ముందుకు రాబోతుంది అని చెప్పాలి ఇప్పుడు… ఒరిజినల్ వర్షన్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో తెలుగు వర్షన్ కూడా అలాంటి టాక్ నే కనుక సొంతం చేసుకుంటే షో షో కి కలెక్షన్స్ పరంగా గ్రోత్ ని చూపెడుతూ….
ఓవరాల్ గా మొదటి రోజు 1.5-2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సినిమా అందుకునే అవకాశం ఉంటుంది. అంతకుమించిన జోరు సినిమా చూపించాల్సిన జోరు సినిమా చూపించాలి అంటే టాక్ అల్ట్రా సాలిడ్ గా వచ్చి అన్ని సెంటర్స్ లో సినిమా సాలిడ్ జోరు చూపించాల్సి ఉంటుంది. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.