Home గాసిప్స్ బెల్లంకొండ భైరవం మూవీ బడ్జెట్ ఇన్ని కోట్లు అయిందా!!

బెల్లంకొండ భైరవం మూవీ బడ్జెట్ ఇన్ని కోట్లు అయిందా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న హీరోల్లో టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) ఒకరు…అప్పుడెప్పుడో 2019 టైంలో రాక్షసుడు సినిమాతో మంచి హిట్ ని అందుకున్నా కూడా తర్వాత టైంలో మళ్ళీ వరుస పెట్టి ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్నా కూడా….

బెల్లంకొండ శ్రీనివాస్ మూవీస్ కి ఎప్పటికప్పుడు నాన్ థియేట్రికల్ రైట్స్ పరంగా సాలిడ్ రేట్స్ సొంతం అవుతూనే ఉండటం వలెనే హిట్స్ లేక పోయినా కూడా ఎప్పటికప్పుడు బెల్లంకొండ మూవీస్ కి సాలిడ్ బడ్జెట్ లు నిర్మాతలు పెట్టడానికి సిద్ధంగానే ఉంటూ రాగా…

లేటెస్ట్ గా భైరవం(Bhairavam Movie) సినిమా చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేయబోతూ ఉండగా తనతో పాటు నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) లు కీలక రోల్స్ లో నటించబోతూ ఉండగా…

తమిళ్ లో సూపర్ హిట్ అయిన గరుడన్ మూవీ కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా బడ్జెట్ పరంగా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కింది… ఆల్ మోస్ట్ సినిమా కోసం 50 కోట్ల రేంజ్ లో నిర్మాణం అయ్యిందని సమాచారం. బెల్లంకొండ కెరీర్ లో ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ మూవీస్ కాగా..

తమిళ్ లో వచ్చిన గరుడన్ టోటల్ రన్ లో 60 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా ఇక్కడ ఆల్ మోస్ట్ ఇదే రేంజ్ లో బడ్జెట్ తోనే సినిమా నిర్మాణం అవుతూ ఉండగా ఆల్ రెడీ నాన్ థియేట్రికల్ బిజినెస్ సాలిడ్ రేటుకి జరిగింది..

నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే సినిమాకి ఏకంగా 32 కోట్ల రేంజ్ లో రికవరీ జరగగా మిగిలిన అమౌంట్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా జరిగిందని సమాచారం, మొత్తం మీద వరుస ఫ్లాఫ్స్ లో కూడా బెల్లంకొండ బిజినెస్ పరంగా తన రేంజ్ ని చూపెడుతూ ఉండగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here