ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు పర్వాలేదు అనిపించే రేంజ్ అంచనాలతో రిలీజ్ కి సిద్ధం అవుతున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie) సినిమా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన…
గరుడన్ సినిమా తెలుగు రీమేక్ గా రూపొందుతూ ఉండగా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా కి ఏ సర్టిఫికేట్ సొంతం అయ్యింది. ఇక సినిమా 2 గంటల 35 నిమిషాల రన్ టైంతో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా…
సెన్సార్ వాళ్ళ నుండి ప్రామిసింగ్ రిపోర్ట్ నే సొంతం చేసుకుంది సినిమా…కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ ఒక ఊర్లో దేవాలయం ఉన్న ప్లేస్ ను దక్కించుకోవాలని కొందరు ట్రై చేస్తారు…దాన్ని హీరో ఎలా అడ్డుకున్నాడు అన్నది కోర్ పాయింట్…
తమిళ్ తో పోల్చితే తెలుగు లో హీరోయిజం ఎలివేట్ సీన్స్ ను ఇంకా పెంచి బెల్లంకొండకి సెట్ అయ్యే రేంజ్ లో కొన్ని మార్పులు చేశారని తెలుస్తుంది. సినిమాలో నారా రోహిత్ అలాగే మంచు మనోజ్ ల క్యారెక్టర్స్ ఇచ్చే ట్విస్ట్ లు కూడా బాగా హైలెట్ అయ్యేలా ప్లాన్ చేశారట…
మొత్తం మీద ఫస్టాఫ్ ఎబో యావరేజ్ గా ఉంటూనే ఎంటర్ టైన్ మెంట్ అండ్ యాక్షన్ మిక్స్ అవుతుందని, సెకెండ్ ఆఫ్ లో కొంచం కథ సీరియస్ గా సాగుతూ మెలో డ్రామాతో రివేంజ్ టర్న్ తీసుకుని బాగానే ఎండ్ అవుతుందని అంటున్నారు….
మొత్తం మీద తమిళ్ రిజల్ట్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉందని చెబుతూ ఉండగా బెల్లంకొండ శ్రీనివాస్ కి రాక్షసుడు తర్వాత మరో మంచి సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు… మొత్తం మీద సెన్సార్ వాళ్ళ నుండి…
మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న భైరవం సినిమా ఇక రెగ్యులర్ ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించేలా టాక్ ను సొంతం చేసుకున్నా మంచి వసూళ్ళని బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి…