బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు ఒక స్ట్రైట్ మూవీ ఒక రీ రిలీజ్ వచ్చాయి. 15 ఏళ్ల క్రితం డిసాస్టర్ అయిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ఖలేజా(Khaleja4K Re Release) సినిమా ఈ వీకెండ్ లో వసూళ్ళ వీరంగం సృష్టించింది… ఇక కొత్త సినిమాగా వచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas)…
నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie) మూవీ కూడా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా రీ రిలీజ్ ను ఆపలేక పోయింది.
మొదటి రోజే మాస్ రచ్చ చేసిన ఖలేజా సినిమా భైరవం మీద సాలిడ్ లీడ్ ను సొంతం చేసుకోగా తర్వాత రెండు రోజుల్లో కొత్త సినిమా భైరవం కొంత గ్రోత్ ని చూపించి ఖలేజాని అందుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఓవరాల్ గా చూసుకుంటే…
వీకెండ్ లో భైరవం సినిమా 9 కోట్ల రేంజ్ కి కొంచం అటూ ఇటూగా వరల్డ్ వైడ్ గ్రాస్ మార్క్ ని అందుకోగా ఖలేజా మొదటి రోజు లీడ్ హెల్ప్ అయ్యి వీకెండ్ లో డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ ని అందుకుని టాలీవుడ్ తరుపున రీ రిలీజ్ లో ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను సృష్టించింది.
ఓ కొత్త సినిమాను ఒక డిసాస్టర్ రీ రిలీజ్ వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో డామినేట్ చేసి సంచలనం సృష్టించడం మామూలు విషయం కాదు, ఇక లాంగ్ రన్ లో ఎలాగోలా కొత్త సినిమా అయిన భైరవం డీసెంట్ పెర్ఫార్మెన్స్ ను చూపించే అవకాశం ఉండగా…ఖలేజా మాత్రం వీకెండ్ లో వీర బాదుడు బాదేసింది అని చెప్పాలి.