Home న్యూస్ భైరవం మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

భైరవం మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన  బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie) సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో ప్రమోషన్స్ ను జరుపుకుని రిలీజ్ అవ్వగా సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే ఊరిలో వారాహి అమ్మవారి గుడి పనులను చూసుకునే భాద్యత బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ మరియు నారా రోహిత్ ల మీద ఉంటుంది. ఆ గుడి ప్రాంతాన్ని దక్కించుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తారు. మరి హీరో ఏం చేశాడు అన్నది అసలు కథ…

పెర్ఫార్మెన్స్ పరంగా రాక్షసుడు తర్వాత బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్, సటిల్డ్ రోల్ అయినా ఇంటర్వెల్ ఎపిసోడ్ ముందు ఆ తర్వాత సెకెండ్ ఆఫ్ లో యాక్షన్ డోస్ తో మాస్ ఆడియన్స్ ను బాగా మెప్పించే ప్రయత్నం చేశాడు అని చెప్పాలి…

ఇంటర్వెల్ ఎపిసోడ్ తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలుస్తుంది. అదే టైంలో మంచు మనోజ్ చాలా టైం తర్వాత తెర మీద రెచ్చిపోయాడు. డైలాగ్స్ కొంచం ఓవర్ ది టాప్ అనిపించినా కూడా తనదైన నటనతో మెప్పించాడు. నారా రోహిత్ సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు…

ఇక హీరోయిన్ రోల్ అలాగే లవ్ సీన్స్ సినిమాకి బ్రేక్స్ గా నిలిచాయి, డైరెక్టర్ ఒరిజినల్ లో ఉన్న సీన్స్ నే మళ్ళీ దింపాడు కానీ ఈ లవ్ సీన్స్ డోస్ ని కొంచం తగ్గించి ఉంటే బాగుండేది… మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించగా…సంగీతం పర్వాలేదు అనిపించగా కొన్ని చోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది…

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ టేక్ ఆఫ్ కి టైం పట్టగా ఒక 25-30 నిమిషాల తర్వాత నుండి సినిమా పుంజుకోవడం స్టార్ట్ అవుతుంది. సెకెండ్ ఆఫ్ లో యాక్షన్ డోస్ ఎక్కువ అయినట్లు అనిపించినా కొన్ని చోట్ల ఎమోషన్ బాగానే పండింది అని చెప్పాలి…

ప్రొడక్షన్ వాల్యూస్ మెప్పించగా ఓవరాల్ గా డైరెక్టర్ విజయ్ కనకమేడల ఉన్నంతలో ఒరిజినల్ ని ఏమి చెడగొట్టకుండా భైరవంని తీశాడు కానీ లెంత్ కొంచం తగ్గించి ఉంటే బాగుండేది…బెల్లంకొండ రీసెంట్ మూవీస్ లో మాత్రం బెస్ట్ ఔట్ పుట్ అని చెప్పొచ్చు. అలాగే ఒరిజినల్ చూడని ఆడియన్స్ కి కొంచం ఎక్కువ నచ్చుతుంది.

మొత్తం మీద రెగ్యులర్ మూవీనే అయినా కూడా ఊరు, గుడి, కొన్ని మేజర్ ట్విస్ట్ లు, సాలిడ్ యాక్షన్ సీన్స్ లాంటివి మాస్ ఆడియన్స్ కి బాగానే కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరీ కొత్తదనం కోరుకునే వారికి యావరేజ్ లెవల్ లో అనిపించినా కూడా…

మాస్ ఆడియన్స్ కి మాత్రం సినిమా ఈజీగా ఒకసారి చూసేలా అనిపించడం ఖాయం. ఓవరాల్ గా సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ముందే చెప్పినట్లు బెల్లంకొండ రీసెంట్ మూవీస్ లో రాక్షసుడు తర్వాత బెస్ట్ అని చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here