టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఎప్పటి నుండో సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలో బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) ఒకరు…అప్పుడెప్పుడో రాక్షసుడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ తర్వాత మళ్ళీ హిట్ ని అయితే అందుకోలేకపోయాడు. వరుస ఫ్లాఫ్స్ పడుతున్న టైంలో…
మరో పక్క హిందీలో ఛత్రపతి రీమేక్ తో వచ్చినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేక పోయాడు. ఇలాంటి టైంలో తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన గరుడన్ మూవీ ని తెలుగులో భైరవం(Bhairavam Movie) పేరుతో రీమేక్ చేయగా కీలక రోల్స్ లో…
నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) లు నటిస్తూ ఉండగా ఈ నెల ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ ఉన్న రేంజ్ లో ఆకట్టుకుంటే కచ్చితంగా ఇక్కడ మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉండగా…
మరో పక్క వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాతో మరోసారి నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా మాస్ రచ్చ చేశాడు. బెల్లంకొండ సినిమాలకు హిందీలో ఎప్పటి నుండో మంచి క్రేజ్ ఉండటంతో ప్రతీ సారి నాన్ థియేట్రికల్ బిజినెస్ రేట్లు సాలిడ్ గానే పలుకుతూ ఉండగా….
ఈ సినిమా విషయంలో కూడా నాన్ థియేట్రికల్ బిజినెస్ సాలిడ్ రేటుకే క్లోజ్ అయ్యిందని అంటున్నారు…జీ నెట్ వర్క్ వాళ్ళు టోటల్ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ను డబ్ అండ్ డైరెక్ట్ వర్షన్ లు కలిపి సాలిడ్ రేటుకి దక్కించుకున్నట్లు సమాచారం…
ఆల్ మోస్ట్ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ అక్షరాలా 32 కోట్ల రేంజ్ కి క్లోజ్ అయినట్లు తెలుస్తుంది…వరుస ఫ్లాఫ్స్ లో ఉన్నప్పటికీ కూడా నాన్ థియేట్రికల్ బిజినెస్ పరంగా మరోసారి బెల్లంకొండ తన మాస్ పవర్ ని చూపించాడు. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇక…