బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie) సినిమా భారీ లెవల్ లో రిలీజ్ అయింది. ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న…
సినిమాకి అక్కడ నుండి ఫస్ట్ టాక్ ఏంటో బయటికి వచ్చేసింది. కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయడం లేదు కానీ మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఇద్దరు ఫ్రెండ్స్ కి చాలా చేరువ అయిన హీరో ఆ ఊరి గుడిని కాపాడే వాళ్ళలో ఒకరు…ఆ ఊరి గుడికి వచ్చిన ఒక సమస్యని…
సాల్వ్ చేసే క్రమంలో జరిగిన పరిస్థితులు ఏంటి ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… సినిమా ఓపెన్ అవ్వడం సింపుల్ గా ఓపెన్ అయ్యి అందరి పాత్రల పరిచయం, తర్వాత హీరో లవ్ సీన్స్ అండ్ మంచు మనోజ్ నారా రోహిత్ లతో హీరో స్నేహం సీన్స్ తో…
ఫస్టాఫ్ అలా అలా సాగుతూ కొన్ని చోట్ల ఎంటర్ టైన్ మెంట్ ఆకట్టుకోగా ప్రీ ఇంటర్వెల్ నుండి అసలు కథ మొదలు అయ్యి ఇంటర్వెల్ ఎపిసోడ్ బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపగా మంచు మనోజ్ అలాగే నారా రోహిత్ లకు కూడా మంచి సీన్స్ పడతాయి.
ఇంటర్వెల్ ఇచ్చిన హై తో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరగగా సెకెండ్ ఆఫ్ కథ కొంచం మెలో డ్రామా గా మారి స్నేహితుల మధ్య కీలక సన్నివేశాలు, మంచు మనోజ్ మరియు నారా రోహిత్ ల క్యారెక్టర్ ట్విస్ట్ లతో ప్రీ క్లైమాక్స్ కి చేరుకుంటుంది…అక్కడ నుండి రివేంజ్ టర్న్ కూడా…
తీసుకుని హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్ తో సాగే సినిమా ఓవరాల్ గా మాస్ ఆడియన్స్ ను బాగా మెప్పించేలా ముగుస్తుంది. అలాగే ఇతర సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకునేలా ఎండ్ అవుతుంది అని చెప్పాలి. మొత్తం మీద ఫస్టాఫ్ యావరేజ్ టు ఎబో యావరేజ్ లెవల్ లో..
సెకెండ్ ఆఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో అనిపిస్తుంది…ఓవరాల్ గా సినిమా కూడా ఎబో యావరేజ్ లెవల్ లో ఎండ్ అవ్వగా ఒరిజినల్ వర్షన్ కి కొన్ని చిన్న చిన్న మార్పులు చేయగా అవి బాగానే ఆకట్టుకోగా ఒరిజినల్ ని ఎక్కడా చెడగొట్టలేదు అని చెప్పాలి…
ఒరిజినల్ చూడని ఆడియన్స్ కి సినిమా కొంచం ఎక్కువగానే ఆకట్టుకునే అవకాశం ఉంది. ఓవరాల్ గా ప్రీమియర్స్ అయ్యాక సినిమాకి ఎబో యావరేజ్ లెవల్ లో రెస్పాన్స్ ఉందని చెప్పాలి. ఇక రెగ్యులర్ షోలకు టాక్ ఇంకా బెటర్ అయ్యే అవకాశం ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇప్పుడు…