Home న్యూస్ కార్తికేయ ‘భజే వాయు వేగం’..బిజినెస్, థియేటర్స్….బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

కార్తికేయ ‘భజే వాయు వేగం’..బిజినెస్, థియేటర్స్….బ్రేక్ ఈవెన్ టార్గెట్!!

0

2023 ఇయర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బెదురులంక2012(Bedurulanka 2012) సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న యంగ్ హీరో కార్తికేయ(Kartikeya) ఆ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు ఇప్పుడు భజే వాయు వేగం(Bhaje Vaayu Vegam Movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా…

సినిమా ట్రైలర్ ఆసక్తి కలిగించే విధంగా ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చూపించే అవకాశం అయితే ఉందీ అనిపించేలా ఉందని చెప్పాలి. ఇక సినిమా ను డీసెంట్ గా ప్రమోట్ చేయగా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఈ సినిమా 300 రేంజ్ లో స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 400 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది.

Bhaje Vaayu Vegam Movie Pre Release Busines and Break Even Target
ఇక సినిమాను మేకర్స్ తెలుగు రాష్ట్రలలో కొన్ని చోట్ల ఓన్ గానే రిలీజ్ చేస్తూ ఉండగా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 3 కోట్ల దాకా ఉంటుందని అంచనా… ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 3.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకుందని అంచనా…దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు….

ఓవరాల్ గా 4 కోట్ల రేంజ్ లో షేర్ ని కనుక సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ గా నిలిచింది అని చెప్పొచ్చు. పోటిలో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమా కి మౌత్ టాక్ ఇప్పుడు చాలా ముఖ్యం అని చెప్పాలి. టాక్ బాగుంటే ఓపెనింగ్స్ ఎలా ఉన్నా లాంగ్ రన్ ఉండే అవకాశం ఉంటుంది. మరి సినిమా ఎంతవరకు కార్తికేయకి మరో హిట్ ని అందిస్తుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here