Home న్యూస్ భజే వాయు వేగం….బడ్జెట్ అండ్ రికవరీ….లాభమా నష్టమా!!

భజే వాయు వేగం….బడ్జెట్ అండ్ రికవరీ….లాభమా నష్టమా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అయిన  కార్తికేయ(Kartikeya) నటించిన లేటెస్ట్ సినిమా భజే వాయువు వేగం(Bhaje Vaayu Vegam Movie) మొదటి రోజు మంచి టాక్ ను సొంతం చేసుకున్నా కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం స్లో స్టార్ట్ ను సొంతం చేసుకోగా తర్వాత మాత్రం మంచి టాక్ పవర్ ను చూపిస్తూ లాంగ్ రన్ ను..

దక్కించుకునే దిశగా దూసుకు పోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో స్టడీ కలెక్షన్స్ తో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్క్ వైపు పరుగులు పెడుతుంది. కాగా ఈ సినిమా మొత్తం మీద ఎంతవరకు బడ్జెట్ పెట్టి తీశారు ఓవరాల్ గా మేకర్స్ కి లాభామా నష్టమా అన్న వివరాలను ఒకసారి గమనిస్తే… సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ 3.70 కోట్ల దాకా ఉండగా…

సినిమాను మొత్తం మీద 12 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో నిర్మించినట్లు తెలుస్తుంది…పబ్లిసిటీ ఖర్చులు కూడా ఇందులోనే అయ్యాయని అంటూ ఉండగా నాన్ థియేట్రికల్ రైట్స్ తోనే సినిమాకి సాలిడ్ బిజినెస్ జరిగింది…శాటిలైట్ రైట్స్ కింద 5 కోట్లు, OTT అండ్ డబ్బింగ్ రైట్స్ కింద మరో 10 కోట్లు మ్యూజిక్ అండ్ ఇతర రైట్స్ తో కలిపి ఓవరాల్ గా…

15.50 కోట్ల నాన్ థియేట్రికల్ బిజినెస్ ను సినిమా సొంతం చేసుకుందట. ఇక థియేట్రికల్ వాల్యూ బిజినెస్ 3.70 కోట్లను కూడా కలిపితే ఓవరాల్ గా సినిమా బిజినెస్ 19 కోట్ల దాకా జరిగినట్లు ట్రేడ్ లో అంచనా…ఆ లెక్కన సినిమా బడ్జెట్ మీద మేకర్స్ కి సాలిడ్ గా లాభాలను సొంతం అయ్యేలా చేసింది…

ఆల్ మోస్ట్ 7 కోట్ల రేంజ్ లో లాభాలను సొంతం చేసుకుని మంచి ప్రాఫిట్స్ ను మేకర్స్ కి సొంతం అయ్యేలా చేసిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా స్టడీ రన్ ని దక్కించుకుంటూ ఉండగా త్వరలోనే ఇక్కడ కూడా క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here