బాక్స్ ఆఫీస్ దగ్గర రాజ రాజ చోర లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న శ్రీ విష్ణు తర్వాత ఒకటి తర్వాత ఒకటి సినిమాలు చేస్తూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఏవి కూడా అనుకున్న రేంజ్ లో అయితే ఇంపాక్ట్ ని చూపించడం లేదు అని చెప్పాలి. రాజ రాజ చోర తర్వాత అర్జునా ఫాల్గుణ సినిమా చేసిన శ్రీ విష్ణు కి ఆ సినిమా…..
డిసాస్టర్ రిజల్ట్ ను ఇవ్వగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు శ్రీ విష్ణు నటించిన కొత్త సినిమా భళా తందనాన అనే కొత్త ప్రయోగంతో వచ్చిన శ్రీ విష్ణు కి మరోసారి చేదు అనుభవం ఎదురు అయ్యింది. పోస్టర్స్ నుండే మినిమమ్ బజ్ ని క్రియేట్ చేయలేక పోయిన ఈ సినిమా…
రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఏమాత్రం ఇంపాక్ట్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర క్రియేట్ చేయలేక పోయింది. దాంతో తొలి ఆటకే ఫ్లాఫ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా కలెక్షన్స్ పరంగా జోరు చూపించలేక పోయింది. సినిమా ఓవరాల్ వర్త్ బిజినెస్ రేంజ్ 2.7 కోట్ల రేంజ్ లో…
ఉందని ట్రేడ్ వర్గాల అంచనా…. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర 3 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఏ దశలో కూడా కలెక్షన్స్ ని సాధించలేక పోయింది 2 రోజుల్లో 25 లక్షల లోపు షేర్ ని అందుకున్న సినిమా టోటల్ రన్ లో తెలుగు రాష్ట్రాలలో 30 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా…
మరో 4 లక్షల లోపు షేర్ ని సొంతం చేసుకోగా టోటల్ గా సినిమా 34 లక్షల షేర్ తో పరుగును ముగించింది. ఇందులో కూడా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని తీసేస్తే ఇక మిగిలేది చాలా తక్కువే అని చెప్పాలి. ఓ బ్లాక్ బస్టర్ తర్వాత బాక్ టు బాక్ వరుస డిసాస్టర్ మూవీస్ తో శ్రీ విష్ణుకి భారీ ఎదురుదెబ్బలు తగిలాయి అని చెప్పాలి. 3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి ఆల్ మోస్ట్ 2.65 కోట్లకి పైగా లాస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా…