Home న్యూస్ రికార్డులు తిరగరాసిన సల్మాన్ భారత్ డే 1 కలెక్షన్స్…

రికార్డులు తిరగరాసిన సల్మాన్ భారత్ డే 1 కలెక్షన్స్…

94
0

  బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ భారత్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించి సల్మాన్ సత్తా ఏంటో మరోసారి చాటి చెప్పింది. రంజాన్ రోజు హాలిడే ఉన్నా ఎక్కువ శాతం నమాజ్ కి వెళతారు, దాంతో పాటే వరల్డ్ కప్ లో ఇండియా మొదటి మ్యాచ్ ఉండటం తో కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నారు, కానీ భారత్ పై ఎలాంటి ప్రభావం పడలేదు.

మొదటి రోజు ఇండియా లో సినిమా ఏకంగా 42.3 కోట్ల నెట్ కలెక్షన్స్ ని వసూల్ చేసి హిందీ సినిమాల పరంగా ఆల్ టైం రెండో హైయెస్ట్ కలెక్షన్స్ ని మొదటి రోజు అందుకున్న సినిమాగా నిలిచింది, మొదటి ప్లేస్ లో అమీర్ ఖాన్ తగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ఉంది. ఒకసారి టాప్ మూవీస్ ని గమనిస్తే…

1. #ThugsOfHindostan – 48.27Cr
2. #Bharat – 42.30Cr
3. #Bahubali2 – 40.73Cr
4. #PremRatanDhanPayo – 39.32Cr
5. #Sultan – 36.59Cr
టాప్ 5 మూవీస్ లో సల్మాన్ సినిమాలు మూడు ఉండటం విశేషం, ఇక మన బాహుబలి టాప్ 3 ప్లేస్ లో కంటిన్యు అవుతుంది, మొత్తం మీద రికార్డుల దుమ్ము దుమారం చేసిన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇక ఇప్పుడు వీకెండ్ మొత్తం ఇదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here