Home న్యూస్ ఇదే ఫైనల్….భారతీయుడు2 ఫైనల్ టాక్ ఇదే!!

ఇదే ఫైనల్….భారతీయుడు2 ఫైనల్ టాక్ ఇదే!!

0

లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) మరియు శంకర్(Shankar) ల క్రేజీ కాంబోలో ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీ భారతీయుడు2 (Bharateeyudu2 Movie) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ప్రీమియర్స్ తర్వాత యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…

రెగ్యులర్ షోలకు మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా సోషల్ మీడియా మొత్తం ఆ టాక్ స్ప్రెడ్ అయింది.. ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోల తర్వాత కామన్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ నుండి ఫైనల్ గా ఎలాంటి టాక్ ను సినిమా సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా…

ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ విషయానికి వస్తే కమల్ హాసన్ పెర్ఫార్మెన్స్ బాగుందని, కానీ లుక్స్ అంతగా సెట్ అయినట్లు అనిపించలేదని, కొన్ని చోట్ల ఎమోషన్స్ బాగానే అనిపించినా ఓవరాల్ గా లెంత్ ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగిందని అంటూ ఉండగా…

వాళ్ళ నుండి సినిమాకి ఓవరాల్ గా యావరేజ్ టు ఎబో యావరేజ్ మధ్యలో సినిమా ఉందన్న టాక్ అయితే ఇప్పుడు వినిపిస్తూ ఉంది… ఇక రెగ్యులర్ అండ్ కామన్ ఆడియన్స్ విషయానికి వస్తే సినిమా స్టార్ట్ అవ్వడం ఆసక్తిగానే స్టార్ట్ అయినా చాలా బేసిక్ కథ అవ్వడంతో ఎక్కడా కూడా…

ఆసక్తిని కలిగించే సీన్స్ పడకపోవడంతో చాలా ఫ్లాట్ గా సినిమా సాగి నీరసం కలిగించిందని అంటూ ఉండగా ఫస్టాఫ్ ఎలాగోలా ఓకే అనిపించినా కూడా సెకెండ్ ఆఫ్ మాత్రం కంప్లీట్ గా నిరాశ పరిచిందని. అసలు కథ మొత్తం పార్ట్ 3 లో పెట్టుకుని పార్ట్ 2 ని జస్ట్ క్రేజ్ కోసం రిలీజ్ చేశారేమో అనిపించింది అంటున్నారు…

మొత్తం మీద రెగ్యులర్ ఆడియన్స్ కామన్ ఆడియన్స్ నుండి సినిమాకి యావరేజ్ రెస్పాన్స్ వస్తూ ఉండగా ఓవరాల్ గా ప్రీమియర్స్ నుండి డే ఎండ్ అయ్యే టైంకి భారతీయుడు2 సినిమా యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక ఈ టాక్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్లు అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here