అప్పట్లో సంచలన విజయం సొంతం చేసుకున్న భారతీయుడు (Bharateeyudu Movie) కి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు చాలా టైం తర్వాత వస్తున్న భారతీయుడు2(Bharateeyudu2 Movie) మీద ఆడియన్స్ లో పర్వాలేదు అనిపించే అంచనాలు ఉన్నాయి…విక్రం మూవీ తో కమల్ హాసన్(Kamal Haasan) ఫామ్ లో ఉండటం…..
ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్(Director Shankar) సినిమాను డైరెక్ట్ చేస్తూ ఉండటంతో ట్రైలర్ పెద్దగా క్లిక్ అవ్వక పోయినా కూడా సినిమా మాత్రం అంచనాలను అందుకుంటుంది అన్న నమ్మకం అందరిలో ఉండగా ఆ నమ్మకమే సినిమా బిజినెస్ పరంగా…
మంచి డీల్స్ ను సొంతం చేసుకునేలా చేయగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా బిజినెస్ ను పూర్తి చేసుకుని సాలిడ్ రేటునే సొంతం చేసుకుంది అని చెప్పాలి ఇప్పుడు. తెలుగు రైట్స్ ను ముందు ఓవరాల్ గా 20 కోట్లకు కొనగా ఇక్కడ లోకల్ బిజినెస్ మొత్తం మీద సాలిడ్ రేటుకి అమ్మినట్లు తెలుస్తుంది…
నైజాంలో సినిమా 9 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది, ఇక సీడెడ్ లో మొత్తం మీద 4 కోట్ల మేర బిజినెస్ ను అందుకోగా ఆంధ్ర రీజన్ లో 11 కోట్ల మేర బిజినెస్ ను సినిమా సాధించినట్లు సమాచారం. దాంతో ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ రేంజ్ …
అక్షరాలా 24 కోట్ల మార్క్ ని అందుకుంది. అంటే సినిమా ఇప్పుడు తెలుగు లో క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 25 కోట్ల రేంజ్ లో షేర్ ని 46-48 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది…. ప్రజెంట్ ఈ టార్గెట్ పెద్దదిగానే కనిపిస్తున్నా కూడా సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే టార్గెట్ ను…
అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి….రీసెంట్ టైంలో తెలుగులో డబ్ అయిన మూవీస్ లో ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ బిజినెస్ అనే చెప్పాలి….ఇక విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ అలాగే కల్కి(Kalki2898AD Movie)మూవీలో స్పెషల్ రోల్ చేసిన కమల్ హాసన్ ఈ సారి భారతీయుడు2 తో ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి ఇక…