Home న్యూస్ ఆడియో రైట్స్ లో భీమ్లా నాయక్ ఆల్ టైం టాలీవుడ్ రికార్డ్!!

ఆడియో రైట్స్ లో భీమ్లా నాయక్ ఆల్ టైం టాలీవుడ్ రికార్డ్!!

870
0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ భీమ్లా నాయక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి కానుకగా ఓ రేంజ్ లో రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా రానా దగ్గుబాటి తో కలిసి పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ మల్టీ స్టారర్ మూవీ మలయాళ బ్లాక్ బస్టర్ అయ్యప్పనుం కోశియుం సినిమా తెలుగు రీమేక్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. రీమేక్ అయినా కానీ సినిమా పై…

ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు పెరిగి పోగా సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన చిన్న గ్లిమ్స్ ఆడియన్స్ అంచనాలను ఓ రేంజ్ లో పెంచేసింది. ఆ అంచనాలను తగ్గట్లు సినిమా టైటిల్ సాంగ్ కూడా అదిరిపోయే రేంజ్ లో మెప్పించింది అని చెప్పాలి.

ఇక సినిమా బిజినెస్ పనులు కూడా మొదలు అవ్వగా ముందుగా సినిమా డిజిటల్ రైట్స్ కి అల్టిమేట్ రేటు సొంతం అయ్యిందని వార్తలు రాగా రీసెంట్ గా సినిమా ఆడియో రైట్స్ ని కూడా అమ్మేశారు. ఆదిత్యా మ్యూజిక్ సొంతం చేసుకున్న ఈ సినిమా ఆడియో రైట్స్…

టాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన నాన్ పాన్ ఇండియా మూవీస్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసిందని అంటున్నారు. మ్యూజిక్ రైట్స్ ఇది వరకు మెగాస్టార్ ఆచార్య సినిమా కి 4 కోట్ల రేటు సొంతం అవ్వగా ఆ రేటు ని సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట ఆడియో రైట్స్ తో 4.5 కోట్లతో బ్రేక్ చేసి కొత్త రికార్డ్ ను నమోదు చేయగా…

ఇప్పుడు పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా ఆడియో రైట్స్ తో బ్రేక్ చేసి ఏకంగా 5.04 కోట్ల రేటు ని సొంతం చేసుకుని ఆల్ టైం బిగ్గెస్ట్ రికార్డ్ రేటు ని దక్కించుకున్నాడు. దాంతో టాలీవుడ్ లో ఇప్పుడు మ్యూజిక్ రైట్స్ పరంగా నాన్ పాన్ ఇండియా మూవీస్ లో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది భీమ్లా నాయక్ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here