Home న్యూస్ 24 గంటలు ఓవర్…రికార్డ్ ముక్క మిగల్లేదుగా!

24 గంటలు ఓవర్…రికార్డ్ ముక్క మిగల్లేదుగా!

11243
1

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లిమ్స్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా గ్లిమ్స్ కి ఆడియన్స్ నుండి అల్టిమేట్ రెస్పాన్స్ వస్తుంది….. టాలీవుడ్ లో ఇప్పటి వరకు వచ్చిన గ్లిమ్స్ లో కొత్త రికార్డులతో దుమ్ము దుమారం లేపిన ఈ గ్లిమ్స్ మొదటి కొన్ని గంటల లోనే పాత రికార్డులను అన్నీ బ్రేక్ చేసి కొత్త రికార్డులతో దుమ్ము దుమారం లేపింది.

పవర్ స్టార్ మాస్ యాటిట్యూడ్, తమన్ మెస్మరైజింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ గ్లిమ్స్ కి మెయిన్ హైలెట్ గా నిలిచింది. దాంతో అందరూ రిపీట్ మోడ్ లో ఈ గ్లిమ్స్ ను చూస్తూ ఉండటం విశేషం. ఇక ఈ గ్లిమ్స్ ఇప్పుడు మొత్తం మీద 24 గంటలను పూర్తీ చేసుకుని…

టాలీవుడ్ తరుపున గ్లిమ్స్ లో కొత్త రికార్డులను నమోదు చేసింది. 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి యూట్యూబ్ లో 8.49 మిలియన్స్ అప్ డేట్ వ్యూస్ ను అలాగే 728.6K లైక్స్ ని సాధించి పాత రికార్డులను తుడిచి పెట్టింది. ఇది వరకు హైయెస్ట్ వ్యూస్ రికార్డ్ సైరా గ్లిమ్స్ పేరిట 7.2M గా ఉండేది.

ఆ రికార్డ్ ను బ్రేక్ 1 మిలియన్ కి పైగా లీడ్ తో బ్రేక్ చేసి సంచలనం సృష్టించగా లైక్స్ రికార్డ్ రాధేశ్యామ్ గ్లిమ్స్ పేరిట 394.4K గా ఉండేది, ఆ రికార్డ్ ను కూడా ఆల్ మోస్ట్ డబుల్ మార్జిన్ అనిపించే రేంజ్ లో బ్రేక్ చేసి సంచలనం సృష్టించిన భీమ్లా నాయక్ ఏకంగా టాలీవుడ్ టీసర్ల జాబితాలో కూడా టాప్ 5 లో ఒకటిగా….

నిలిచే విధంగా లైక్స్ తో దుమ్ము లేపింది…ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ 940.3K, పుష్ప ఇంట్రో టీసర్ 793K, వకీల్ సాబ్ టీసర్ 776.9K, సర్కారు వారి పాట బ్లాస్టర్ 754.9K తర్వాత ఇప్పుడు 728.6K మార్క్ ని అందుకుని టాప్ 5 లో కూడా చోటు సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. ఈ రేంజ్ రెస్పాన్స్ అంటే మామూలు ఊచకోత కాదనే చెప్పాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here