Home న్యూస్ 24 గంటల రికార్డ్ ఔట్ అక్కడ….ఊచకోత అంటే ఇది!!

24 గంటల రికార్డ్ ఔట్ అక్కడ….ఊచకోత అంటే ఇది!!

0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీదున్నారు. హరి హర వీర మల్లు సినిమా టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ సడెన్ గా చెప్పడం తో వ్యూస్ పరంగా కానీ లైక్స్ పరంగా కానీ కొత్త రికార్డులు అందుకోవడంలో విఫలం అవ్వగా ఆ కసి మొత్తం ఇప్పుడు భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లిమ్స్ ను రిలీజ్ చెయడంతో ఈ గ్లిమ్స్ తో తీర్చుకుని సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతున్నారు…

మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోశియుం సినిమా తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమా ను టైటిల్ ను కన్ఫాం చేస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్ సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రచ్చ చేయడం మొదలు పెట్టింది. ఇక యూట్యూబ్ లో కూడా…

సంచలన వ్యూస్ అండ్ లైక్స్ రికార్డులను అందుకుంటూ దూసుకు పోతున్న ఈ గ్లిమ్స్ టాలీవుడ్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఫస్ట్ గ్లిమ్స్ లో 24 గంటల్లో హైయెస్ట్ లైక్స్ ను సొంతం చేసుకున్న ప్రీవియస్ రికార్డ్ ను రెండు గంటల 13 నిమిషాల టైం లోనే బ్రేక్ చేసి ఇప్పుడు…

సంచలన కొత్త బెంచ్ మార్క్ వైపు అడుగులు వేస్తూ దూసుకు పోతుంది. ఇది వరకు ప్రభాస్ రాధే శ్యామ్ గ్లిమ్స్ 24 గంటల్లో 394.4K లైక్స్ ను అందుకోగా ఆ రికార్డ్ ను ఆల్ రెడీ బ్రేక్ చేసి ఇప్పుడు 24 గంటల్లో సరికొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయడానికి సిద్ధం అవుతుంది. ఇక వ్యూస్ పరంగా హైయెస్ట్ రికార్డ్ ను అందుకోవాలి అంటే సైరా నరసింహా రెడ్డి గ్లిమ్స్…

నెలకొల్పిన 7.2 మిలియన్ వ్యూస్ రికార్డ్ ను 24 గంటల్లో అందుకోవాలి. చూస్తుంటే ఈ రికార్డ్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఓవరాల్ గా 24 గంటల్లో అటు వ్యూస్ పరంగా ఇటు లైక్స్ పరంగా కూడా సరికొత్త రికార్డులను ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here