Home న్యూస్ ఆల్ ఇండియాని షేక్ చేస్తున్న భీమ్లా నాయక్…మాస్ రాంపేజ్ ఇది!

ఆల్ ఇండియాని షేక్ చేస్తున్న భీమ్లా నాయక్…మాస్ రాంపేజ్ ఇది!

1506
0

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన అయ్యప్పనుం కోశియుం సినిమా తెలుగు రీమేక్ గా తెరకేక్కుతూ ఉండగా సినిమా మేకింగ్ వీడియోలతో మంచి హైప్ ను ఆల్ రెడీ సొంతం చేసుకోగా సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్…. ఫ్యాన్స్ అంచనాలను కూడా మించి పోయే విధంగా…

కట్ చేసిన ఈ గ్లిమ్స్ ఫ్యాన్స్ కి మామూలు కిక్ ఇవ్వలేదు, రీసెంట్ టైం లో టాలీవుడ్ లో వచ్చిన మూవీస్ లోకి వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ అనిపించుకునే రేంజ్ లో అల్టిమేట్ BGM తో తమన్ ఊరమాస్ కొట్టుడు కొట్టగా పవర్ స్టార్ యాటిట్యూడ్…

అండ్ మాస్ డైలాగ్ విత్ గూస్ బంప్స్ ఎలివేషన్స్ తో గ్లిమ్స్ ఓ రేంజ్ లో కిక్ ఇచ్చింది. దాంతో టాలీవుడ్ గ్లిమ్స్ రికార్డులు కాదు ఇండియన్ గ్లిమ్స్ రికార్డులను అన్నీ బ్రేక్ చేసి సంచలనం సృష్టిస్తున్న ఈ గ్లిమ్స్ ఇప్పుడు ఇండియా వైడ్ గా ఓ క్రేజీ టాపిక్ గా మారింది.

బ్యాగ్రౌండ్ స్కోర్ ఓ రేంజ్ లో అదరగొట్టడంతో సోషల్ మీడియా లో అన్ని చోట్లా భీమ్లా నాయక్ మీమ్స్, వీడియోల హవా నడుస్తుంది. ట్విట్టర్ లో ఇండియా క్రికెట్ మ్యాచ్ ఎలివేషన్స్ నుండి మొదలు కొని ఇతర విషయాల్లో కూడా భీమ్లా నాయక్ గ్లిమ్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ ని, పవన్ కళ్యాణ్ డైలాగ్ కట్ ను కూడా ఓ రేంజ్ లో వాడుకుంటున్నారు.

మేకర్స్ సాలిడ్ రెస్పాన్స్ ని అయితే గ్లిమ్స్ తో ఎక్స్ పెర్ట్ చేశారు, ఈ రేంజ్ యుఫోరియా ని మాత్రం అంచనా వేయలేదు, ఆ రేంజ్ లో కిక్ ఇచ్చిన భీమ్లా నాయక్ ఇప్పుడు ప్రస్తుతం వైడేస్ట్ రీజ్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది, సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోయడానికి ఇది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ కానుంది ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here