బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ రచ్చ చేయడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుం కోశియం సినిమా కి రీమేక్ గా తెరకెక్కగా ఒరిజినల్ ని మించి భారీ హైప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఆ హైప్ ను ఎంత వరకు నిలబెట్టుకుంది, ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… కర్నూల్ ఏరియాలో సబ్ ఇన్సిపెక్టర్ గా పనిచేస్తున్న భీమ్లా నాయక్ ఏరియా డ్రై ఏరియా… అక్కడ అనుకోకుండా ఒకరోజు మందు బాటిల్స్ తో పట్టుబడిన రానా దగ్గుబాటికి మరియు పవన్ కళ్యాణ్ కి ఏర్పడిన ఈగో క్లాషేస్ ఎంత దూరం వెళ్ళాయి అన్నది సినిమా కథ పాయింట్….
కథగా చెప్పాలి అంటే చాలా సింపుల్ స్టొరీ పాయింట్ తో తెరకెక్కిన సినిమా ఇది, కానీ క్యారెక్టరైజేషన్స్ పరంగా సినిమా చాలా బాగా ఆకట్టుకోవడం ఒరిజినల్ ని మంచి విజయంగా నిలపగా ఇక్కడ కూడా అదే రేంజ్ లో సినిమాను ఆకట్టుకునేలా తీశారు డైరెక్టర్… ముందుగా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే….
సిన్సియర్ పోలిస్ ఆఫీసర్ గా పవర్ స్టార్ పెర్ఫార్మెన్స్ బాగా ఆకట్టుకోగా హీరోయిజం ఎలివేట్ సీన్స్ లో తన యాటిట్యూడ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేలా ఉందని చెప్పాలి. తన డైలాగ్స్ కూడా బాగా రాశారు, ఓవరాల్ గా పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఫుల్ సాటిస్ ఫై చేశాడు… ఇక రానా రోల్ కూడా ఒరిజినల్ ఉన్నట్లు పవర్ ఫుల్ గా ఉండగా….
ఢీ అంటే ఢీ అన్నట్లు పవన్ తో పోటీ పడి మరీ రెచ్చిపోయాడు, ఇద్దరి ఫైట్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి అని చెప్పాలి. ఇక చిన్న రోల్ లో నిత్య మీనన్ ఆకట్టుకోగా సముద్రఖని, ఇతర పాత్రలు కూడా తమ తమ రోల్స్ లో పర్వాలేదు అనిపించుకున్నారు. ఇక సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్స్ సినిమా కి మరో హైలెట్స్ అని చెప్పాలి….
పాటలు చూడానికి కూడా ఆకట్టుకోగా ఫైట్స్ కి, ఎలివేట్ సీన్స్ కి తమన్ కొట్టిన బ్యాగ్రౌండ్ స్కోర్ థియేటర్స్ లో విజిల్స్ వేసేలా చేసింది… ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో కొంచం తడబడగా ప్రీ ఇంటర్వెల్ నుండి సెకెండ్ ఆఫ్ మొత్తం ఫుల్ రేసీగా ఆకట్టుకుంది. ఇక డైలాగ్స్ బాగుండగా సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.
ఇక త్రివిక్రమ్ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని ప్రీ క్లైమాక్స్ సీన్ ని మార్చారు, అవి చాలా వరకు మెప్పించడం విశేషం, ఇక సాగర్ కే చంద్ర డైరెక్షన్ ఒరిజినల్ ని ఏమాత్రం చెడగొట్టకుండా అదే రేంజ్ లో మెయిన్ టైన్ చేస్తూ తెలుగు ఆడియన్స్ కి నచ్చేలా పవన్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలను పెట్టి సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు….
ఓవరాల్ గా ఒరిజినల్ చూసిన వాళ్ళకి సినిమా అదే రేంజ్ లో హిట్ బొమ్మగా అనిపిస్తుంది, చూడని వాళ్ళకి విందుభోజనంలా అనిపించడం ఖాయం అని చెప్పాలి. కొంచం ఫైట్స్ ఓవర్ డోస్ అయినట్లు అనిపించడం, ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం టైం పట్టడం లాంటివి చిన్న చిన్న మైనస్ పాయింట్స్ తప్పితే భీమ్లా నాయక్ చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పాలి. అందుకే సినిమాకి మా రేటింగ్ 3.25 స్టార్స్….