Home న్యూస్ కొండలు అడ్డుగా ఉన్నా…బరిలోనే ఉన్న భీమ్లా నాయక్!!

కొండలు అడ్డుగా ఉన్నా…బరిలోనే ఉన్న భీమ్లా నాయక్!!

1317
0

వచ్చే ఏడాది సంక్రాంతి పోటి ఎంతో జోరుగా సాగేలా ఉంది. పోటి లో ఇప్పటి వరకు ఎవరు ఉన్నారు అన్నది ఇది వరకే కన్ఫాం చేశారు కానీ సడెన్ గా రేసు మారింది. ఇది వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ ల సినిమాలు పోటి లో ఉండగా ఇప్పుడు అనుకోకుండా పోటి లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీ…

ఆర్ ఆర్ ఆర్ బరిలోకి దిగుతుందని రీసెంట్ గా అనౌన్స్ చేశారు. చాలా కాలంగా ఎప్పటికప్పుడు అనుకోకుండా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఆర్ ఆర్ ఆర్ ఇప్పుడు ఇంకా లేట్ ని తట్టుకోలేని పరిస్థితిలో సంక్రాంతి బరిలో ఎంటర్ అవ్వగా పోటి లో ఇది వరకే….

తమ సినిమాలను అనౌన్స్ చేసిన భీమ్లా నాయక్ మరియు సర్కారు వారి పాట సినిమాలు వెనక్కి తగ్గి ఆర్ ఆర్ ఆర్ కి దారి వదిలాయి అని వార్తలు రాగా ఆర్ ఆర్ ఆర్ మాదిరిగానే ఎప్పటి నుండో రిలీజ్ పోస్ట్ పోన్ అవుతున్న రాధే శ్యామ్ సంక్రాంతికే రిలీజ్ ను ఫిక్స్ చేశారు…

దాంతో ఇక పోటి రెండు పాన్ ఇండియా మూవీస్ మధ్య ఉండటం ఖాయం అనుకోగా పవన్, మహేష్ లు తర్వాత బరిలోకి దిగుతారు అన్న వార్తలు రాగా, రీసెంట్ గా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా నుండి కొత్త సాంగ్ అనౌన్స్ మెంట్ లో సినిమా రిలీజ్ డేట్ ను జనవరి 12 నే ఉంచారు… దాంతో రెండు కొండంత సినిమాలు పోటి లో ఉన్నా ఇప్పటికీ భీమ్లా బరిలోనే ఉందని కన్ఫాం అయ్యింది.

కానీ దీనికి ఒక కారణం ఉంది, ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లు ఇలానే కొనసాగితే ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ అవ్వడం జరగదు, అందుకే చివరి నిమిషం వరకు భీమ్లా నాయక్ బరిలోనే ఉంటుంది అంటున్నారు… రాధే శ్యామ్ కూడా అదే డేట్ కి ఫిక్స్ అయినట్లు చెబుతున్నారు. మరి సంక్రాంతి కి ఇంకా మూడు నెలల టైం ఉంది కాబట్టి అప్పటికి ఏమైనా జరగోచ్చు అని చెప్పాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here