లాస్ట్ ఇయర్ వకీల్ సాబ్ టైం లో మొదలు అయిన టికెట్ రేట్ల సమస్య రీసెంట్ గా ముగుసింది అంటూ ఏకంగా మెగాస్టార్, సూపర్ స్టార్ మరియు రెబల్ స్టార్ లు కలిసి వెళ్ళడంతో అందరికీ తెలిసినా కానీ కొత్త జీవో ని మాత్రం ప్రభుత్వం ఇప్పటి వరకు ఇవ్వలేదు ఆంధ్ర ప్రదేశ్ లో… ఒక పక్క సినిమా ఇండస్ట్రీ కి మేం ఉన్నాం అంటూ నైజాంలో స్పెషల్ షోలు, రోజుకి 5 షోలు…
భారీ టికెట్ హైక్స్ లాంటివి ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంటే మరో పక్క ఆంధ్ర లో మాత్రం పరిస్థితులు ఏమాత్రం బాలేవు అనే చెప్పాలి. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన భీమ్లా నాయక్ సినిమా కి….
టికెట్ హైక్స్ తో రిలీజ్ ఉంటుంది అనుకున్నా అలా లేదు సరికదా ప్రభుత్వం స్టేట్ మొత్తం మరే సమస్యలు లేనట్టు ఈ సినిమా మీద ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది, టికెట్ రేట్లు వకీల్ సాబ్ టైం లో పెట్టినవి అలానే మళ్ళీ పెట్టాలి అంటూ నిర్ణయం తీసుకోగా, అది సజావుగా సాగుంతుందా లేదా అనేది…
చూడటానికి ప్రతీ థియేటర్ లో ప్రభుత్వం తరుపు నుండి VRO లను ఇతర ప్రభుత్వ ఉద్యోగులను అక్కడ ఉండాలని థియేటర్స్ లో టికెట్ రేట్లు పెంచకుండా బెనిఫిట్ షోలు వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో చాలా సి డి మాస్ సెంటర్స్ లో 5,10, 20 టికెట్ రేట్స్ తో థియేటర్స్ ని నడపలేమని థియేటర్స్ ని క్లోజ్ చేశారట చాలా ఏరియాలలో…
ఆల్ మోస్ట్ 50 నుండి 60 సి డి సెంటర్స్ లో థియేటర్స్ ఇప్పుడు సినిమాను ప్రదర్శితం చేయడం లేదని సమాచారం, దానికి తోడూ ఇప్పుడు థియేటర్స్ లో ప్రభుత్వ ఉద్యోగులకు తోడూ మిలటరీ అండ్ భారీ సెక్యూరిటీని కూడా పెట్టి ఇవన్నీ ఎట్టి పరిస్థితులలో కూడా జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. ఇవన్నీ సోషల్ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉండగా కేవలం భీమ్లా నాయక్ ని టార్గెట్ చేస్తూ ఇలా చేయడం విచారకరం అని అంటున్నారు అందరూ..