బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో కలెక్షన్స్ పరంగా మాస్ రాంపేజ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్, ఆంధ్రలో రేట్ల వలన బ్రేక్ ఈవెన్ ని అందుకోవడానికి మరింత కష్ట పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక సినిమా కి ఇతర రాష్ట్రాలలో అలాగే ఓవర్సీస్ లో మాత్రం సూపర్ కలెక్షన్స్ సొంతం అవుతూ ఉండగా అన్ని ఏరియాల లోకి కూడా….
ముందుగా బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకున్న ఏరియా గా ఓవర్సీస్ ఏరియా నిలవగా అందులో అమెరికా లో సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోయింది అని చెప్పాలి. ఇక్కడ కేవలం 2 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తోనే బ్రేక్ ఈవెన్ ని అందుకున్న ఈ సినిమా…
తర్వాత కూడా సాలిడ్ కలెక్షన్స్ తో పరుగును కొనసాగించి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అమెరికాలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాగా నిలిచింది, ఇది వరకు అట్టర్ ఫ్లాఫ్ అయిన అజ్ఞాతవాసితోనే ఏకంగా 2.065 మిలియన్ మార్క్ ని అందుకున్నాడు పవన్ కళ్యాణ్… సెకెండ్ వేవ్ వలన వకీల్ సాబ్ అక్కడ అంచనాలు తప్పినా…
ఇప్పుడు భీమ్లా నాయక్ మాత్రం 5 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్ తో కెరీర్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ను తిరగరాసింది… అమెరికాలో సినిమా కలెక్షన్స్ ని ఒకసారి గమనిస్తే
👉Premieres – $875,292
👉Day 1 – $451,798
👉Day 2 – $471,358
👉Day 3 – $223,195
👉Day 4 – $39,152
👉Day 5 – $198,832
Total: $2.26M(17.13CR~)
ఇవీ సినిమా అమెరికాలో 5 రోజులు పూర్తీ అయ్యే టైం కి సొంతం చేసుకున్న టోటల్ కలెక్షన్స్ లెక్క…
ఇప్పటికీ అక్కడ సూపర్ స్ట్రాంగ్ గా థియేటర్స్ ని హోల్డ్ చేసిన ఈ సినిమా ఈ వీకెండ్ లో మళ్ళీ బ్యాటింగ్ చూపిస్తే 2.5 మిలియన్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. అదే కనుక జరిగితే టాలీవుడ్ మూవీస్ పరంగా టాప్ 10-12 ప్లేసులలో ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు…. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక..