టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ సినిమాను బాక్స్ ఆఫీస్ బరిలో సంక్రాంతికి దింపాలని ముందు నుండే ప్రిపేర్ అయ్యి జనవరి 12న రిలీజ్ అంటూ పోస్టర్ లతో ఫస్ట్ నుండి సినిమా రిలీజ్ ను కన్ఫాం చేస్తూ వచ్చారు, కానీ సడెన్ గా ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి రేసులోకి ఎంటర్ అవ్వడంతో భీమ్లా నాయక్ తగ్గుతుందని అనుకున్నారు కానీ డిసెంబర్ 20 వరకు కూడా…
భీమ్లా నాయక్ సంక్రాంతి రిలీజ్ కి పనులు చక చకా కంప్లీట్ చేసుకుంటూ వచ్చింది, కానీ తర్వాత ఆర్ ఆర్ ఆర్ టీం స్పెషల్ గా వెళ్లి పవన్ ని టీం ని రిక్వెస్ట్ చేయడంతో సినిమాను ఫిబ్రవరి 25నకి పోస్ట్ పోన్ చేసి పనులను ఆపేసి కొంచం న్యూ ఇయర్ కోసం రిలాక్స్ అయ్యారు…
కానీ అనుకోకుండా పరిస్థితుల వలన ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడంతో భీమ్లా నాయక్ తిరిగి రేసులోకి ఎంటర్ అవుతుంది అనుకున్నారు కానీ ఇంకా పెండింగ్ వర్క్ సినిమాకి బాగానే ఉందని తెలుస్తుంది. ఒక పాట షూటింగ్, కొంత భాగం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్…..
తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పెండింగ్ ఉందని తెలుస్తుంది దాంతో పాటు తమన్ ఇప్పుడు రాధే శ్యాం కి బ్యాగ్రౌండ్ స్కోర్ చేస్తున్నాడు….. కాగా మేకర్స్ ఆ పాటని కట్ చేయాలనీ అనుకుంటున్నారట కానీ మిగిలిన పనులు ఇంకో 10 రోజుల్లో పూర్తీ అవ్వడం కష్టమే అని అంటున్నారు. కానీ పనులు మాత్రం జరుగుతున్నాయని, రిలీజ్ కి రెండు మూడు రోజుల ముందు వర్క్ అయితే భీమ్లా రేసులోకి ఎంటర్ కావొచ్చు కానీ పనులు కంప్లీట్ అయ్యే అవకాశం…
చాలా అంటే చాలా తక్కువే అని అంటున్నారు, సో ఏదైనా మిరాకిల్ జరిగి టీం అంటా డే అండ్ నైట్ వర్క్ చేసి పని కంప్లీట్ చేస్తే తప్ప భీమ్లా నాయక్ రిలీజ్ కష్టమే అని అంటున్నారు. పండక్కి ఫుల్ హైప్ ఉన్న భీమ్లా నాయక్ రిలీజ్ అయ్యి ఉంటే ఇతర రాష్ట్రాలలో ఇబ్బందులు వచ్చినా ఉన్న లిమిటేషన్స్ లో కూడా భీమ్లా నాయక్ ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేసేది, మంచి ఛాన్స్ మిస్ అయింది అనే చెప్పాలి ఇప్పుడు.