నితిన్ నుండి వచ్చిన రీసెంట్ మూవీస్ లో అ ఆ తర్వాత మరే సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గీత దాటలేదు, ఇలాంటి టైం లో కూడా సాలిడ్ గా 21.8 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకున్న నితిన్ లేటెస్ట్ మూవీ భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున నేడు రిలీజ్ అవ్వగా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకున్న సినిమా కి అక్కడ ఫస్ట్ టాక్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయకపోయినా… సోలోగా ఉండే హీరో రష్మిక ని చూసి లవ్ లో పడగా అనుకోకుండా కంపెనీ సిఈవో అవ్వాల్సి వస్తుంది, తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, హీరో కి ఎదురు అయిన సమస్యలను ఎలా గెలిచాడు అన్నది ఓవరాల్ కథ అంటున్నారు.
హీరో నితిన్ పెర్ఫార్మెన్స్ పరంగా కుమ్మేశాడని అంటున్నారు, ముఖ్యంగా కామిక్ టైమింగ్, సింగిల్ లైనర్స్, యాక్షన్ సీన్స్ లో హీరోయిజం, హీరోయిన్ లో లవ్ ఎపిసోడ్ ఇలా ప్రతీ సీన్ లో ఫుల్ ఈజ్ తో నటించి ఫుల్ ఫామ్ లో ఉన్న హిరోలా రెచ్చిపోయాడని అంటున్నారు.
ఇక హీరోయిన్ రష్మిక కూడా తన లుక్స్ తో అండ్ పెర్ఫార్మెన్స్ తో కూడా మెప్పిస్తుందని అంటున్నారు, వీళ్ళ కి ఏమాత్రం తగ్గని విధంగా వెన్నెల కిషోర్ కామెడీ ఓ రేంజ్ లో వర్కౌట్ అయిందని అంటున్నారు. ఇక సంగీతం పర్వాలేదు అనిపించే విధంగా ఉండగా. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుందని…
హీరోయిజం ఎలివేట్ సీన్స్ కి అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ దక్కిందని అంటున్నారు. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా వరకు బాగుండగా కొన్ని చోట్ల స్లో అవుతుందని అంటున్నారు. సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయని అంటున్నారు. ఇక డైరెక్షన్ పరంగా… వెంకీ కొడుముల మొదటి సినిమా ఛలో కి…
ఏమాత్రం తగ్గని కామెడీ ఎంటర్ టైనర్ విత్ స్మాల్ సోషల్ మెసేజ్ తో వచ్చాడని, వచ్చి అంచనాలను అందుకున్నాడని అంటున్నారు. ఛలో కన్నా కూడా కొన్ని చోట్ల భీష్మ ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుందని అంటున్నారు. కానీ స్టొరీ పాయింట్ ఒక్కటే చాలా చిన్నగా ఉంటుందని.
అదొక్కటి తప్పితే….సినిమా పెర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ అని అంటున్నారు. ఓవరాల్ గా ఓవర్సీస్ లో ముగిసిన ప్రీమియర్ షోల తర్వాత భీష్మ సినిమా కి హిట్ కి ఏమాత్రం తక్కువ కానీ రెస్పాన్స్ దక్కుతుందని చెప్పొచ్చు. ఇది సంక్రాంతి మూవీస్ తర్వాత బెస్ట్ గా చెప్పుకుంటున్నారు.
ఇదే కనుక ఇప్పుడు రెగ్యులర్ షోలకు కూడా సినిమా కి టాక్ రూపం లో దక్కితే…చప్పగా సాగుతున్న ఫిబ్రవరి అన్ సీజన్ ఒక్క సారిగా ఊపు నిచ్చే అంశం అవుతుందని చెప్పాలి. ఇక రెగ్యులర్ షోలకు సినిమా కి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.