Home న్యూస్ భగవంత్ కేసరి బుకింగ్స్ రిపోర్ట్…డే 1 ఎంత రావొచ్చు అంటే!

భగవంత్ కేసరి బుకింగ్స్ రిపోర్ట్…డే 1 ఎంత రావొచ్చు అంటే!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అనిల్ రావిపూడి(Anil Ravipudi) ల కాంబినేషన్ లో భారీగా రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమా భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా 67.35 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా…

68.50 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 1350 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అడ్వాన్ బుకింగ్స్ ను మూడు రోజుల ముందే ఓపెన్ చేశారు… కాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్ర రీజన్ లో….

సీడెడ్ లో స్టడీగా ఉండగా నైజాంలో సినిమా బుకింగ్స్ బాలయ్య వీర సింహా రెడ్డి(Veera Simha Reddy) సినిమాతో పోల్చితే కొంచం స్లోగానే బుకింగ్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల టోటల్ గ్రాస్ బుకింగ్స్ రేంజ్ 7 కోట్ల దాకా ఉంది ఇప్పటి వరకు…. అన్ని చోట్లా ఓవరాల్ గా జరిగిన గ్రాస్ బుకింగ్స్ రేంజ్ అటూ ఇటూగా అఖండ(Akhanda Movie) రేంజ్ లో ఉన్నాయి అని చెప్పాలి…

దాంతో సినిమా ఇదే ట్రెండ్ ను కంటిన్యూ చేస్తే అఖండ రేంజ్ లో ఓపెనింగ్స్ ను మొదటి రోజు అందుకునే అవకాశం ఉండగా టాక్ బాగుండి షో షోకి కలెక్షన్స్ పెరిగితే సినిమా మొదటి అఖండ కన్నా ఎక్కువ వసూళ్లు అందుకోవచ్చు. ఓవరాల్ గా సినిమా టాక్ మీదే డిపెండ్ అయ్యి ఉందని చెప్పాలి.

ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి సినిమా తెలుగు రాష్ట్రాల్లో 14-15 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది, టాక్ బాగుండి షో షో కి కలెక్షన్స్ జోరు చూపిస్తే సినిమా 16-18 కోట్ల దాకా షేర్ ని అందుకోవచ్చు, అలాగే ఇతర సినిమాల రిజల్ట్ పై కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది అని చెప్పాలి. ఇక డే 1 భగవంత్ కేసరి ఈ అంచనాలను మించిపోతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here