బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ వరుస ఫ్లాఫ్స్ నుండి ఈ ఇయర్ వాల్తేరు వీరయ్య సినిమాతో సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) భారీ లాభాలను కూడా సొంతం చేసుకోవడం విశేషం. అలాంటి విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు….
భోళా శంకర్ మూవీతో ఆగస్ట్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమాతో మెగాస్టార్ వాల్తేరు వీరయ్య విజయానికి ఏమాత్రం తీసిపోని హిట్ ని అందుకోవాల్సిన అవసరంతో పాటు ఇప్పుడు మరో పెద్ద భాద్యత కూడా ఉందని చెప్పాలి.
ఈ ఇయర్ సమ్మర్ లో భారీ అంచనాల నడుమ తెరకెక్కిన ఏజెంట్ మూవీ అంచనాలను అందుకోవడం విషయంలో తీవ్రంగా విఫలం అయ్యి భారీ నష్టాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా నిర్మాత అలాగే భోళా శంకర్ నిర్మాత ఒక్కరే అవ్వడంతో…
చాలా మందికి నెక్స్ట్ మూవీ మెగాస్టార్ ది ఉండటంతో ఆ సినిమా ద్వారా వచ్చే అమౌంట్ ని కొద్ది వరకు నష్టాలను పూడ్చుతామని మాట ఇచ్చినట్లు ఇప్పుడు టాలీవుడ్ ట్రేడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఏజెంట్ బయర్స్ కే ఇప్పుడు భోళా శంకర్ వెళ్ళబోతుందని సమాచారం.
మొత్తం మీద ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్(Bholaa Shankar) తో దుమ్ము లేపడంతో పాటు ఏజెంట్(Agent) నష్టాలను కూడా పూడ్చాల్సిన అవసరం ఉంది. మరి మెగాస్టార్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేసి ఈ నష్టాలను కవర్ చేస్తారో చూడాలి.
Ajent ki idhi poodusthundhi mari dheeniki vachetivi evaru poorusthaaaru ??? Just asking ……!!!! Akkada director em rajamouli em kaaadhu ithagaaado track record enti 6years nundi okka movie koodaa ledhu