Home న్యూస్ వీళ్ళు 32 అంటున్నారు…వాళ్ళు 26 అంటున్నారు…ఏమవుతుందో ఇక!!

వీళ్ళు 32 అంటున్నారు…వాళ్ళు 26 అంటున్నారు…ఏమవుతుందో ఇక!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ భోళా శంకర్(Bhola Shankar) భారీ లెవల్ లో ఆగస్ట్ 11న రిలీజ్ కి సిద్ధం అవుతుంది. లాస్ట్ ఇయర్ బాక్ టు బాక్ Acharya మరియు God Father సినిమాలతో ఆడియన్స్ ను నిరాశ పరిచినా కానీ…

ఈ ఇయర్ సంక్రాంతికి Waltair Veerayya సినిమాతో దుమ్ము లేపే విజయాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి ఇప్పుడు భోళా శంకర్ తో మరోసారి మెప్పించే అవకాశం ఉండగా సినిమా బిజినెస్ పరంగా ఆల్ రెడీ కొన్ని చోట్లా సాలిడ్ బిజినెస్ ను అందుకుంటూ ఉండగా…

నైజాం ఏరియాలో సినిమా బిజినెస్ ఆఫర్స్ వస్తున్నా కూడా ఇప్పటి వరకు ఏ ఆఫర్ ఓకే అవ్వలేదని లేటెస్ట్ టాలివుడ్ ట్రేడ్ సమాచారం. సినిమా మేకర్స్ వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో భోళా శంకర్ కి నైజాంలో మినిమమ్ 32 కోట్ల రేంజ్ లో..

ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఎక్స్ పెర్ట్ చేస్తూ ఉండగా బయర్స్ సినిమా రిలీజ్ టైంలో ఉన్న పోటి అలాగే సంక్రాంతి సీజన్ మిగిలిన రోజుల్లో కలెక్షన్స్ కి ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఆ రేంజ్ బిజినెస్ కష్టమని చెబుతూ 25 నుండి 26 కోట్ల రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ ను కోట్ చేస్తున్నారట.

దాంతో మేకర్స్ ఇప్పటి వరకు సినిమా బిజినెస్ ను నైజాం ఏరియాలో కన్ఫాం చేయలేదని తెలుస్తుంది… సంక్రాంతి టైంలో వాల్తేరు వీరయ్య దుమ్ము లేపినా కానీ ఇప్పుడు అలాంటి కలెక్షన్స్ ఆగస్ట్ లో పోటిలో వచ్చే అవకాశం తక్కువ అవ్వడంతో బయ్యర్స్ రేటుని తగ్గించమని చెబుతున్నారట. మరి ఫైనల్ గా సినిమా బిజినెస్ ఇంతకు కన్ఫాం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here