బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) సినిమాతో భారీ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఇండిపెండెన్స్ వీకెండ్ లో భోళా శంకర్(Bhola Shankar) సినిమాతో…
రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్(Mehar Ramesh) అవ్వడంతో అంచనాలు కొంచం తక్కువగానే ఉన్నాయని చెప్పాలి, కానీ సినిమా ఒరిజినల్ వర్షన్ అయిన వేదళం(Vedalam) తెలుగులో అందుబాటులో లేక పోవడంతో…
ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ను మెప్పించే అవకాశం కొద్ది వరకు ఉందని అనిపించగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ చూస్తుంటే సినిమా కచ్చితంగా మెగాస్టార్ ఖాతాలో మరో 100 కోట్ల సినిమాగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందీ అనిపించేలా ఉందని చెప్పాలి.
ఇక టీసర్ లో మెగాస్టార్ తెలంగాణ యాసతో చెప్పిన డైలాగ్స్ కానీ, విజువల్స్ కానీ, మెగా స్వాగ్ కానీ, బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ అన్నీ బాగా సెట్ అయ్యాయి అని చెప్పొచ్చు. ఇక వింటేజ్ చిరును గుర్తు చేస్తూ చిన్న కామెడీ టైమింగ్ కూడా బాగుండటం విశేషం అని చెప్పాలి.
మొత్తం మీద టీసర్ సినిమా మీద ఉన్న అంచనాలను భారీగా పెంచేసింది అని చెప్పాలి… తమిళ్ వేదళం మూవీ తో పోల్చితే కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లు టీసర్ లో అనిపిస్తూ ఉండగా రిలీజ్ అయిన తర్వాత ఇదే విధంగా మెప్పిస్తే సినిమా కచ్చితంగా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…