కార్తీ హీరోగా వచ్చిన ఖైదీ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే… అలాంటి సినిమాను హిందీ లో అజయ్ దేవగన్ రీమేక్ చేయబోతున్నాడు అంటే అంచనాలు పెరిగి పోగా టీసర్ రిలీజ్ వరకు ఆ అంచనాలను మెయిన్ టైన్ చేసిన భోళా తర్వాత ట్రైలర్ రిలీజ్ నుండి అంచనాలను తప్పుతూ వచ్చింది, ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఒరిజినల్ చూసిన ఆడియన్స్ ను ఏమాత్రం మెప్పించలేక పోయింది అని చెప్పాలి ఇప్పుడు…
ఒరిజినల్ కథను అలాగే తీసుకున్నా ఇక్కడ హీరోకి ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టి అందులో హీరోయిన్ ని పెట్టి లవ్ స్టొరీ, లవ్ సాంగ్ పెట్టగా అవి ఏమాత్రం ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేదు, తండ్రి కూతుళ్ళ ఎమోషనల్ సీన్స్ పండలేదు. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ ఎంతలా ఓవర్ ది టాప్ అయ్యాయి అంటే హీరో కొడితే…
విలన్స్ బోన్స్ ముక్కలు అయిపోతాయి. ఇలా చాలా సన్నివేశాలలో చూపించగా, యాక్షన్ కెమరా యాంగిల్స్ కూడా చాలా నాసిరకంగా అనిపించాయి… ఒరిజినల్ చూడని వాళ్ళకి ఇది కొంచం ఓవర్ ది టాప్ లా అనిపించినా కొంచం పర్వాలేదు అనిపించవచ్చు ఏమో కానీ ఒరిజినల్ చూసి హిందీ లో ఎలా ఉంటుందో అని వెళ్ళిన ఆడియన్స్ కి మాత్రం…
సినిమా చుక్కలు చూయించడం ఖాయం…. కొన్ని సీన్స్ మినహా భోళా ఏ దశలో కూడా ఒరిజినల్ దరిదాపుల్లోకి కూడా రాలేక పోయింది. ఇక సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని అనౌన్స్ చేయగా LCU లో మాదిరిగా ఇక్కడ కూడా ఒక యూనివర్స్ ని డిఫెరెంట్ గా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారట. మరి ఆ సినిమాలు ఎలా ఉంటాయో చూడాలి. భోళా మాత్రం ఒరిజినల్ లో సగం కూడా మెప్పించలేక నిరాశ పరిచింది.