బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో హిందీ లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమా అజయ్ దేవగన్ నటించిన భోళా… ఖైదీ సినిమా హిందీ రీమేక్ గా రూపొందిన ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉండగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ఒరిజినల్ చూసిన వాళ్ళకి పెద్దగా నచ్చక పోయినా ఒరిజినల్ చూడని ఆడియన్స్ ను పర్వాలేదు అనిపించేలా మెప్పించింది. దాంతో సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఉన్నంతలో వీకెండ్ లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుందని చెప్పాలి ఇప్పుడు. సినిమా మొదటి రోజు 11.20 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా రెండో రోజు 7.4 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంది. మూడో రోజు 12.10 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే 4వ రోజు…
ఆదివారం అడ్వాంటేజ్ తో సినిమా 13.48 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ ని సాధించింది. దాంతో టోటల్ గా సినిమా 4 రోజుల్లో ఇప్పుడు టోటల్ గా ఇండియాలో 44.28 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సాధించింది. వరల్డ్ వైడ్ గా సినిమా 65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుందని సమాచారం.
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ వరల్డ్ వైడ్ గా 180 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోవాల్సి ఉంటుందట. ఈ లెక్కన సినిమా ఇంకా స్ట్రాంగ్ కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తేనే ఆ గ్రాస్ టార్గెట్ ను వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉంటుంది. మరి సినిమా ఎలా హోల్డ్ చేస్తుందో చూడాలి.