టాలీవుడ్ సీనియర్ హీరోలు ఇప్పటికీ టాప్ స్టార్స్ కి ఏమాత్రం తీసి పోనీ కలెక్షన్స్ ని సాధిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలు నిరాశ పరిచినా ఒక్క సినిమాతో ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా ఇప్పుడు వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ తర్వాత ఆడియన్స్ ముందుకు త్వరలో భోళా శంకర్ సినిమా తో రావడానికి సిద్ధం అవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి… ఈ సినిమా షూటింగ్…
ఆల్ మోస్ట్ ఎండ్ స్టేజ్ కి వచ్చేయగా ముందు సమ్మర్ కి రిలీజ్ అనుకున్నా ఇప్పుడు సెకెండ్ ఆఫ్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి ముందుగా మెగాస్టార్ రెమ్యునరేషన్ కింద 45 కోట్ల దాకా మనీ తీసుకోబోతున్నట్లు వార్తలు రాగా ఇప్పుడు రెమ్యునరేషన్ ని తీసుకోవడం లేదని వార్తలు…
టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. రెమ్యునరేషన్ అమౌంట్ తీసుకోకుండా సినిమా ఓవరాల్ గా జరిగే బిజినెస్ అండ్ థియేట్రికల్ రన్ షేర్ మొత్తం చూసిన తర్వాత పెర్సెంటేజ్ పరంగా రెమ్యునరేషన్ ని తీసుకోవాలని మెగాస్టార్ భావిస్తున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్…
ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉండగా ఇదే కనుక నిజం అయితే నిర్మాత సేఫ్ అనే చెప్పాలి. సినిమా నడిస్తే హీరోకి నిర్మాతకి డబ్బులు వస్తాయి. లేదంటే నిర్మాత రెమ్యునరేషన్ పరంగా కొంచం సేఫ్ గా ఉంటాడు. త్వరలోనే రెమ్యునరేషన్ పరంగా క్లియర్ న్యూస్ ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపడం ఖాయమని చెప్పాలి.