ఒక సినిమా ముందు అనుకున్న డేట్ కి ఆడియన్స్ ముందుకు రావడం అప్పుడప్పుడు మిస్ అవ్వడం కామన్ గా జరుగుతూ ఉంటుంది, రీసెంట్ గా ఇలాంటి ఇంసిడెంట్ మరోటి జరిగింది… టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ పై ఆల్ రెడీ ఎక్స్ లెంట్ బజ్ ఏర్పడింది… కాగా ఈ సినిమాను ముందు ఏప్రిల్ లో రిలీజ్ అనుకున్నా షూటింగ్…
అనుకోని పరిస్థితుల నడమ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ రాగా సినిమాను ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు… అప్పుడే మహేష్ బాబు పుట్టిన రోజు కూడా ఉండటంతో ఫ్యాన్స్ కి మంచి గిఫ్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు… కానీ ఇప్పుడు ఆ డేట్ కి మహేష్ సినిమా రావడం లేదు…
అదే డేట్ కి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ భోలాశంకర్ సినిమా రిలీజ్ కాబోతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఏప్రిల్ ఎండ్ టైంలో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాను పోస్ట్ పోన్ చేసి ఆగస్ట్ 11 న ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేయగా…
SSMB28 డేట్ ని భోలాశంకర్ తీసుకున్నాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నా, సినిమా డైరెక్టర్ అయిన మెహర్ రమేష్ కి మహేష్ బాబు క్లోజ్ ఫ్రెండ్ అవ్వడంతో మహేష్ కి చెప్పే ఈ డేట్ ని తీసుకుని ఉంటారు అంటున్నారు ఇండస్ట్రీ. ఇక మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా దసరాకి ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పుడు.