టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన కొత్త సినిమా భోలా శంకర్(Bhola Shankar) వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అయ్యింది. సినిమా వరల్డ్ వైడ్ గా 1500 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ను పూర్తి చేసుకుని…
అక్కడ నుండి ఫస్ట్ టాక్ కూడా బయటికి వచ్చేసింది. ఆ టాక్ చాలా వరకు పాజిటివ్ గా ఉందని చెప్పొచ్చు కానీ ఓవరాల్ స్టోరీ పరంగా మాత్రం చాలా రొటీన్ గా అనిపిస్తుందని కానీ ట్రీట్ మెంట్ మాత్రం ఫ్యాన్స్ కి నచ్చేలా ఆడియన్స్ ని మెప్పించే సీన్స్ తో ఆకట్టుకునేలా తెరకెక్కించారని అంటున్నారు ఇప్పుడు…
సినిమా కథ పాయింట్ ని పూర్తిగా రివీల్ చేయక పోయినా కానీ తన సిస్టర్ తో ఉండే హీరో కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండగా, ఆ ఫ్లాష్ బ్యాక్ వలన వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది, అనుకోకుండా సౌమ్యుడుగా ఉండే హీరో విలన్స్ తో భీకర పోరాటం చేయాల్సి వస్తుంది, దాని వెనక ఉన్న రీజన్ ఏంటి, హీరో తర్వాత ఎం చేశాడు అన్నది కథ పాయింట్…
పూర్తి కథ ని రివీల్ చేయకుండా ఓవరాల్ సమ్మరీని చెప్పగా ఒరిజినల్ వర్షన్ ని అలాగే తీసుకుని మెగాస్టార్ కి సెట్ అయ్యేలా కొన్ని మార్పులు చేయగా మిగిలిన కథని అలాగే ఉంచారని అంటున్నారు. ఫస్టాఫ్ కథ కొంచం స్లోగా స్టార్ట్ అయ్యి కొన్ని కామెడి సీన్స్ బ్రదర్ సిస్టర్ సీన్స్ తో మెప్పిస్తూ అసలు కథ లోకి వెళ్లి…
తర్వాత ఇంటర్వెల్ ఎపిసోడ్ తో ఓ రేంజ్ లో హై ఇచ్చి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగిపోతాయని, సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అయ్యాక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగా మెప్పించి తిరిగి ప్రజెంట్ టైం లో హీరో విలన్ ల మధ్య వచ్చే సీన్స్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతాయని అంటున్నారు.
ఓవరాల్ గా సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కథ రొటీన్ గానే అనిపించినా కూడా ఫ్యాన్స్ మూమెంట్స్, హీరో ఎలివేషన్ సీన్స్, ఫ్యామిలీకి నచ్చే ఎలిమెంట్స్ ఇలా అన్నీ ఉన్న కమర్షియల్ కథ అవ్వడంతో ఒకసారి చూసేలా సినిమా ఉంటుందని అంటున్నారు..
మొత్తం మీద ప్రీమియర్స్ ని పూర్తి చేసుకున్న భోలా శంకర్ కి ఓవరాల్ గా ఆడియన్స్ నుండి యావరేజ్ టు ఎబో యావరేజ్ అటూ ఇటూగా టాక్ వినిపిస్తుంది, వాల్తేరు వీరయ్య కూడా ఆల్ మోస్ట్ ఇదే రేంజ్ టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు జనరల్ ఆడియన్స్ నుండి… భోలా శంకర్ కూడా ఇదే రేంజ్ టాక్ ను సొంతం చేసుకుంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మెప్పించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రచ్చ చేయాలి అంటే ఈ రేంజ్ టాక్ చాలా అవసరమని చెప్పాలి. మరి సినిమాకి ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ సొంతం అవుతుందో చూడాలి.